Home » » Producer Sunil Narang Elected as Telangana State Film Chamber of Commerce President

Producer Sunil Narang Elected as Telangana State Film Chamber of Commerce President

 తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సునీల్ నారంగ్- నూతన పాలక మండలి ప్రకటన  



తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా విఎల్ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి ఎన్నికయ్యారు. సెక్రటరీగా కె అనుపమ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద్ రాజ్ తడ్ల, ట్రెజరర్ గా చంద్ర శేఖర్ రావు తో పాటు 15 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వహణ వర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు.


ప్రెస్ మీట్ లో సునీల్ నారంగ్ మాట్లాడుతూ... నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. గత యేడాది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పూర్తి సమయం కేటాయించడం సాధ్యపడలేదు. నాన్నగారు గతించారు. బ్రదర్ అనారోగ్యానికి గురయ్యారు. అలాగే పెండింగ్ లో వున్న నాలుగైదు ప్రాజెక్ట్స్ పూర్తి చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏదైనా అవసరం, సమస్య వుంటే హాజరయ్యాను. నేను అందించాల్సిన సహకారం అందించాను. ఈ యేడాది ఖచ్చితంగా సమయం కేటాయించి అందరితో కలిసి సమస్యలు ఉంటే పరిష్కరించే ప్రయత్నం చేస్తాను’’ అన్నారు  


వైస్ ప్రెసిడెంట్స్ గా విఎల్ శ్రీధర్ మాట్లాడుతూ.. నన్ను  వైస్ ప్రెసిడెంట్   గా ఎన్నుకున్నందుకు అందరికీ థాంక్స్. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి ఒక అభ్యర్ధన.   మాకు ఎక్కడైనా స్థలం ఇస్తే ఒక ఛాంబర్ నిర్మించుకుంటాం’’అని కోరారు.  


తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం కు శుభాకాంక్షలు. అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా సంతోషం. ఇది చాలా మంచి వాతావరణం.అందరూ కలిసి పరిశ్రమ, కార్మికుల అవసరాలకు అనుగుణంగా పని చేయాలని ఆశిస్తున్నాను’’ అన్నారు  


ప్రొడ్యుసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లడుతూ.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం మంచి విషయం. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా శక్తివంతమైనది. అందరూ కలిసికట్టుగా ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు. కొత్తగా ఎన్నికైన టీం సభ్యులు అందరికీ శుభాకాంక్షలు’’ తెలిపారు


తెలుగు  ప్రొడ్యుసర్ కౌన్సిల్ సెక్రటరి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్,  తెలుగు ప్రొడ్యుసర్ కౌన్సిల్, చిత్ర పరిశ్రమ ఒక్కటిగా కలసికట్టుగా వెళ్తున్నాం. ఏ వేడుక జరిగినా, ఏ సమస్య వచ్చిన కలసికట్టుగానే వున్నాం. దీనికి ఈ కమిటీ ఎంతో దోహదపడింది. భవిష్యత్తులో కూడా కలసికట్టుగానే ముందుకు వెళ్తాం. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.



Share this article :