Home » » Manu Charitra Pre Release Event Held Grandly

Manu Charitra Pre Release Event Held Grandly

‘మను చరిత్ర’లో ఆర్ఎక్స్100 వైబ్స్ కనిపిస్తున్నాయ్. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది: మను చరిత్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయయంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన ఇంటెన్స్ లవ్ స్టొరీ ‘మను చరిత్ర.ప్రొద్దుటూరు టాకీస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 23న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో కార్తికేయ ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిత్ర యూనిట్ తో పాటు హీరో రక్షిత్, డైరెక్టర్ అజయ్ భూపతి, కొండా విజయ్, శేఖర్ రెడ్డి తదితరులు ఈవెంట్ కు హాజరయ్యారు .


ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ఈవెంట్ లో అజయ్, శేఖర్ రెడ్డి, రాజ్ కందుకూరి గారిని చూస్తుంటే నాకు ఆర్ఎక్స్ 100 రీయూనియన్ లా అనిపించింది. రాజ్ కందుకూరి గారు ఆర్ఎక్స్ 100 ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆర్ఎక్స్ 100 తర్వాత రాజ్ గారికి ఇంకా దగ్గరయ్యాను. సినిమా చేయాలనే చర్చలు జరుగుతున్న సమయంలో శివ యూఎస్ నుంచి వచ్చారు. చూడటానికి చాలా అందంగా క్యూట్ గా ఉన్నారు. శివని హీరోగా లాంచ్ చేయొచ్చు కదా అన్నాను. మొదట్లో తను సాఫ్ట్ సినిమా చేశారు. ఇప్పుడు మను చరిత్ర ట్రైలర్ చూస్తుంటే టెన్షన్ మొదలైయింది. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆ బ్లాక్ లో మనం ఉన్నాం కదా అనుకున్నా. ట్రైలర్ చూస్తుంటే కాంపిటీషన్ వచ్చిందనిపించింది.(నవ్వూతూ). ట్రైలర్ టీజర్ చాలా హార్డ్ హిట్టింగ్ గా వున్నాయి. ఆర్ఎక్స్ 100 విడుదలకు ముందు ఎలాంటి వైబ్స్ ఉండేవో ఇప్పుడు అలానే అనిపిస్తుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు.

 

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ..కార్తికేయ ఈ ఈవెంట్ కు రావడం ఆనందంగా వుంది. అలాగే రక్షిత్, అజయ్ గారికి కృతజ్ఞతలు. మను చరిత్ర నాకు చాలా స్పెషల్ మూవీ. ప్రతి యాక్టర్ కి ఒక బకెట్ లిస్టు వుంటుంది. ఫైట్ చేయాలి, డ్యాన్స్ చేయాలి, మాస్ పాట ఉండాలని అనుకుంటాం. ఇవన్నీ నాకు ‘మను చరిత్ర’ కంప్లీట్ చేసింది. దర్శకుడు భరత్ చాలా కష్టపడ్డాడు. చాలా ప్రేమిస్తూ చేసిన స్క్రిప్ట్ ఇది. మను చరిత్ర లాంటి మంచి సినిమా ఇచ్చిన భరత్ కి థాంక్స్. తనకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా నటుడిగా ఎన్నో విషయాలు నేర్పించింది. ముఖ్యంగా సహనాన్ని నేర్పించింది. టీం అందరికీ కృతజ్ఞతలు. మేఘ, ప్రగతి, గరిమ చక్కగా పెర్ఫార్మ్ చేశారు. సుహాస్, డాలీ ధనంజయ గారు చాలా కీలకమైన పాత్రలు చేశారు. వారి పాత్రలు మేజర్ బ్యాక్  బోన్ . మ్యూజిక్ గోపిసుందర్, ఎడిటర్ ప్రవీణ్ పూడి అందరూ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. సిరాశ్రీ గారికి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయనలేకపోతె నాకు ఈ సినిమా వచ్చిదే కాదేమో. డైరెక్షన్ టీం కి థాంక్స్. చాలా మంచి సినిమా చేశాం. జూన్ 23న సినిమా వస్తోంది. అందరూ థియేటర్ కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది'' అన్నారు


అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఫెయిల్యూర్ ని సక్సెస్ చేసుకోవడం ఎలా అని ఆర్ఎక్స్ 100 తీసి సక్సెస్ అయ్యా. మను చరిత్రలో విజువల్ చూస్తుంటే దర్శకుడు భరత్ స్టొరీ ఏమో అనే డౌట్ గా వుంది(నవ్వుతూ). ఈ ప్రయత్నంలో తను కూడా విజయ్ సాధించబోతున్నాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. భరత్ చాలా కష్టపడ్డాడు. తనకోసమైనా ఈ సినిమా ఆడాలి. చాలా నిజాయితీగా తీశాడు. మ్యూజిక్, విజువల్స్ అన్నీ బాగున్నాయి. శివ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు.  


శేఖర్ రెడ్డి మాట్లాడుతూ..ఈ సినిమా ఆరంభం నుంచి నాకు తెలుసు. చాలా అద్భుతమైన కథ. ఆర్ఎక్స్ 100 తో అజయ్ ట్రెండ్ సెట్ చేశారు. అలాంటి పెయిన్ ఫుల్ లవ్ స్టొరీతో భరత్ మను చరిత్ర తీశాడు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.'' అన్నారురక్షిత్ మాట్లాడుతూ.. శివ గారికి అభినందనలు జూన్ 23న పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను. భరత్ గారికి ఆల్ ది బెస్ట్. మ్యూజిక్, విజువల్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు


దర్శకుడు భరత్ పెదగాని మాట్లాడుతూ.. మను చరిత్ర చాలా స్వచ్చమైన కథ. ఇందులో  మేఘ ఆకాష్ పాత్ర గుర్తుండిపోతుంది. గరిమ ది కూడా చాలా కీలకమైన పాత్ర. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అజయ్ అన్న కి సిరాశ్రీ గారికి కృతజ్ఞతలు. శివ నా ఫస్ట్ లవ్ . ఇందులో ఆయన చాలా మందిని ప్రేమిస్తాడు. నేను మాత్రం ఆయన్నే ప్రేమిస్తా. ఖచ్చితంగా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది'' అన్నారు.


ప్రగతి శ్రీవాస్తవ్ మాట్లాడుతూ.. చాలా ఆనందంగా ఎక్సయిటింగా వుంది. భరత్ గారికి కృతజ్ఞతలు. నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు. ఇందులో చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ వున్నాయి. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.


గరిమ మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది చాలా స్పెషల్ మూవీ. శివతో పాటు మిగతా నటీనటులందరితో కలిసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.  జూన్ 23న సినిమా విడుదలవుతుంది. అందరూ థియేటర్ లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి'' అని కోరారు.


రాజ్ కందుకూరి మాట్లాడుతూ..కార్తికేయ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా రావడం ఆనందంగా వుంది.  భరత్ ఈ కథ చెబుతున్నపుడు చాలా పెద్ద స్పాన్ వున్న సినిమా అనిపించింది. ఈ రోజు అవుట్ పుట్ చూస్తే చాలా సంతృప్తిగా అనిపించింది. సినిమా పై చాలా నమ్మకంగా వున్నాం. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ అద్భుతంగా వర్క్ చేశారు. సినిమా ప్రేక్షకులు హిట్ చేస్తారనే నమ్మకం వుంది'' అన్నారు.  

 

బెక్కం వేణుగోపాల్.. మను చరిత్ర జూన్ 23న విడుదలౌతుంది. ఈ డేట్ నాకు చాలా స్పెషల్. మేము వయసుకు వచ్చాం సినిమా అదే రోజు విడుదలై పెద్ద హిట్ అందుకుంది. అదే డేట్ కి వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు  


కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు భరత్ నా దగ్గర పని చేశాడు. తను అనుకున్నది తీసే వరకూ రిలాక్స్ అవ్వడు. ఈ  సినిమా  చాలా సార్లు చూశాను. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఈ సినిమాలో పాటలన్నీ బాగున్నాయి శివ గారికి ఇది మైల్ స్టోన్ మూవీ అవుతుంది. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది.'' అన్నారు. ఈ వేడుకలో సిరాశ్రీ, రేవంత్, దేవి ప్రసాద్, ప్రమోదిని. ప్రదీప్ రుద్ర తదితరులు పాల్గొన్నారు.Share this article :