ఈ నెల 23న వస్తున్న ‘భారీ తారాగణం’
సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోషి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘భారీ తారగణం’. శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బివిఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బి.వి రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘నేను రాసిన కథను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. సినిమా మీదున్న నమ్మకంతో విడుదలకు నెల రోజుల ముందే నేను డిస్ట్రిబ్యూటర్లు, సన్నిహితులకు షో వేసి చూపించాం. మంచి స్పందన వచ్చింది. కథ బావుండడంతో పీవీఆర్ ఉదయ్‌గారు సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు. సినిమా ప్రారంభం నుంచి అలీగారు ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేను. ఈ నెల 23న వస్తున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నా. నాకు ఎంతో సహకరించిన నా టీమ్‌కు కృతజ్ఞతలు’’ అని అన్నారు
నిర్మాత మాట్లాడుతూ ‘‘ఆస్ట్రేలియాలో బిజినెస్‌లో ఉన్న నాకు దర్శకుడు శేఖర్ పరిచయమయ్యారు. ఆయన చెప్పిన కథ నాకు కనెక్ట్ అయింది. వెంటనే ఓకే చేసి షూటింగ్ మొదలుపెట్టాం. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. చిన్న సినిమాలను ఆదరిేస్త మరిన్ని మంచి చిత్రాలొస్తాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమిది. కథ, కథనంతోపాటు సంగీతం, అలీ, 7ఆర్ట్స్ సరయు చేసిన ప్రత్యేక గీతం సినిమాకు హైలైట్ అవుతాయి. మా చిత్రాన్ని విడుదల చేస్తున్న పీవీఆర్ సంస్థకు కృతజ్ఞతలు. వచ్చే ఏడాది ఇలాంటి చిత్రాలెన్నో మా బ్యానర్‌పై నిర్మిస్తాం.
‘సినిమాలో అవకాశం పట్ల హీరో హీరోయిన్లు ఆనందం వ్యక్తం చేశారు. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: ఎం.వి గోపి
ఎడిటర్: మార్తండ్ కె. వెంకటేశ్
సంగీతం: సుక్కు
నేపథ్య సంగీతం: సాహిత్య సాగర్
కో-ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ గౌడ్.వి
కొరియోగ్రాఫర్: శ్రీవీర్ దేవులపల్లి
పాటలు: సుక్కూ, సాహిత్య, కమల్ విహాస్, శేఖర్
పిఆర్వో: మధు వి.ఆర్
ఆర్ట్: జెకె మూర్తి
స్టంట్స్: దేవరాజ్
బ్యానర్: బివిఆర్ పిక్చర్స్
నిర్మాత: బి.వి.రెడ్డి
దర్శకత్వం: శేఖర్ ముత్యాల