శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై స్పైన్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోన్ననిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.. ట్రైలర్‌కి అమేజింగ్ రెస్పాన్స్
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. ఈ ఏడాది ‘విరూపాక్ష’ వంటి మిస్టికల్ థ్రిల్లర్‌ను అందించి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు జూన్ 23న మరో స్పైన్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’ అనే చిత్రాన్ని అందించటానికి సిద్ధమయ్యారు. వెర్సటైల్ యాక్టర్ వసంత్ రవి హీరోగా రూపొందుతోన్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’. తరుణ్ తేజ దర్శకత్వం వహించారు.
‘అశ్విన్స్’ మూవీ అనౌన్స్ చేసిన రోజు నుంచి సినిమాపై ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. జూన్ 23న తెలుగు, తమిళ భాషల్లో ‘అశ్విన్స్’ రిలీజ్ అవుతుంది. ఋగ్వేదంలో పేర్కొన్ని అశ్వినీ దేవతలు గురించి మనం పురాణాల్లో చదువుకునే ఉంటాం. వారి కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన సినిమా ఇది. మొత్తం సినిమాను లండన్‌లో చిత్రీకరించారు. వసంత్ రవి ఇందులో యూట్యూబర్ పాత్రలో నటించారు.
చీకటి ప్రపంచం నుంచి మానవులకు చెడును చేసే 1500 ఏళ్ల నాటి శాపం. దీని కారణంగా అమాయకులైన కొంత మంది యూ ట్యూబర్స్ బలమైపోతుంటారు. ట్రైలర్ చూస్తుంటే వెన్నులో తెలియని భయం కలుగుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వాటికి తగ్గట్టు అద్భుతమైన బీజీఎం సన్నివేశాలను మరో లెవల్లో ఎలివేట్ చేస్తున్నాయి. హారర్ చిత్రాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది.
వసంత్ రవితో పాటు విమలా రామన్, మురళీ ధరన్ (నంబీ ఎఫెక్ట్ ఫేమ్), సారస్ మీనన్, ఉదయ దీప్ (‘నిలా కాలమ్’తో జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ విన్నర్), సిమ్రాన్ పరీక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ సిద్ధార్థ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వెంకట్ రాజీన్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు:
వసంత్ రవి, విమలా రామన్, మురళీధరన్, సారస్ మీనన్, ఉదయ దీప్, సిమ్రాన్ పరీక్
సాంకేతిక నిపుణులు:
సమర్పణ: బాపినీడు.బి
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్.వి.సి.సి)
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
సహ నిర్మాత: ప్రవీణ్ డేనియల్
దర్శకత్వం: తరుణ్ తేజ
సంగీతం: విజయ్ సిద్ధార్థ్
సినిమాటోగ్రఫీ: ఎడ్విన్ సాకే
ఎడిటర్: వెంకట్ రాజీన్
పి.ఆర్.ఒ: వంశీ కాకా
Post a Comment