సోహెల్, శ్రీ కోనేటి, ఎం.డీ పాషా 'బూట్ కట్ బాలరాజు' నుంచి 'రాజు నా బాలరాజు' పాటని లాంచ్ చేసిన విజయ్ ఆంటోని
‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.డీ పాషా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుంచి రాజు నా బాలరాజు పాటని హీరో విజయ్ ఆంటోనీ లాంచ్ చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ పాటని తనదైన శైలిలో ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా స్వరపరిచారు. శ్యామ్ కాసర్ల అందించిన సాహిత్యం ఈ పాటకు మరింత సొగసుని తీసుకొచ్చింది. స్వాతి రెడ్డి వాయిస్ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ పాట లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది.
ఈ చిత్రానికి ప్రముఖ డీవోపీ శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. విజయ్ వర్ధన్ ఎడిటర్ కాగా విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: సయ్యద్ సోహెల్ ర్యాన్, మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం, ‘కొత్త బంగారు లోకం’ వివేక్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: శ్రీ కోనేటి
నిర్మాత: ఎం.డీ పాషా
బ్యానర్లు: గ్లోబల్ ఫిల్మ్స్ & కథా వేరుంటది
డీవోపీ: శ్యామ్ కె నాయుడు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: విజయ్ వర్ధన్
ఆర్ట్ డైరెక్టర్: విఠల్ కొసనం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికుమార్ పాత్రుడు
కథ: లక్కీ మీడియా యూనిట్
డైలాగ్స్: దుబాసి రాకేష్, జబర్దస్త్ రాంప్రసాద్
కొరియోగ్రాఫర్లు: ప్రేమ్ రక్షిత్, శేఖర్ VJ, భాను, విజయ్ బిన్ని
యాక్షన్: వింగ్ చున్ అంజి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
ఆడియో: సోనీ మ్యూజిక్