Home » » ZEE5'S Original Series "Vyavastha" STREAMING NOW

ZEE5'S Original Series "Vyavastha" STREAMING NOW

ఎంగేజింగ్ కోర్టు డ్రామాగా రూపొందిన ‘వ్యవస్థ’ ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది : డైరెక్ట‌ర ఆనంద్ రంగ‌

ఏప్రిల్ 28 నుంచి జీ 5లో స్ట్రీమింగ్‌



వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5. సక్సెస్‌ఫుల్ సినిమాలు, సిరీస్‌లు, షోస్‌తో ఆక‌ట్టుకుంటోన్న ఈ టాప్ ఓటీటీ మాధ్య‌మంలో ఏప్రిల్ 28 నుంచి ‘వ్యవస్థ’ స్ట్రీమింగ్ కానుంది. ఈ కోర్టు రూమ్ డ్రామా సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెర‌కెక్కించారు. ఇంత‌కు ఆయ‌న జీ 5లో వ‌చ్చి ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్‌ను తెర‌కెక్కించారు. కార్తీక్ ర‌త్నం, సంప‌త్ రాజ్‌, హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. గురువారం సిరీస్ లాంచ్ డే ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంటైర్ టీమ్ పాల్గొంది. ఈ సంద‌ర్భంగా...

క్రియేటివ్ డైరెక్ట‌ర్ లేఖ మాట్లాడుతూ ‘‘జీ 5 వారి సపోర్ట్‌తో వ్య‌వ‌స్థ కాన్సెప్ట్‌ను చ‌క్క‌టి కోర్టు రూమ్ డ్రామాగా రూపొందించాం. భారీ డైలాగ్.. ఇలా అని కాకుండా ఎంగేజింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. 

జీ 5 సౌత్ కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ సాయితేజ్ మాట్లాడుతూ ‘‘ప్రతి రెండు నెలలకు ఓసారి జీ 5 బ్లాక్ బ‌స్ట‌ర్ కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందిస్తోంది. పులి మేక వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సిరీస్ త‌ర్వాత వ్య‌వ‌స్థ అనే సిరీస్‌తో మీ ముందుకు రాబోతున్నాం. ఇది కూడా కచ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంది. ఆనంద్ రంగగారు అద్భుతంగా డైరెక్ట్ చేస్తే, ప‌ట్టాబిగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా రూపొందించారు. టి హ‌బ్‌లో చిత్రీక‌రించిన తొలి వెబ్ సిరీస్ ఇదే. చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. రేసింగ్‌గా, ప్ర‌తి ఎపిసోడ్ ఓ క్లైమాక్స్‌లా ఉంటుంది. జీ 5ను స‌బ్ స్క్రైబ్ చేసుకుని వ్య‌వ‌స్థ సిరీస్‌ను చూడండి. కార్తీక్‌గారికి, సంప‌త్‌గారికి మ‌ధ్య స‌న్నివేశాలు చాలా బావుంటాయి. హెబ్బా ప‌టేల్‌గారి పాత్ర ఎమోష‌న‌ల్‌గా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. త్వ‌ర‌లోనే వ్య‌వ‌స్థ 2తో మీ ముందుకు వ‌స్తామ‌ని ఆశిస్తున్నాం’’ అన్నారు. 

అసోసియేట్ ప్రొడ్యూసర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ ‘‘మా వ్యవస్థ సిరీస్ ఏప్రిల్ 28న జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈరోజు రాత్రి నుంచి సిరీస్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేయ‌వచ్చు. మంచి టీమ్‌తో వ‌ర్క్ చేశాం’’ అన్నారు. 

సంయుక్త మాట్లాడుతూ ‘‘నాపై నమ్మకంతో వ్యవస్థలో మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు ఆనంద్ రంగ‌గారికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు. 

హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ ‘‘ఓటీటీలో మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వ్య‌వ‌స్థ సిరీస్‌లో న‌టించే అవ‌కాశం వచ్చింది. యామిని రోల్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ఆనంద్ రంగాగారికి థాంక్స్‌. సూప‌ర్బ్ టీమ్‌తో క‌లిసి ప‌ని చేశాను. క‌చ్చితంగా ఆడియెన్స్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఫీల్ అవుతారు’’ అన్నారు. 

కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘‘ఆనంద్ రంగాగారికి థాంక్స్‌. ఆయ‌న సినిమాల‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని. ప‌ట్టాభిగారికి థాంక్స్‌. జీ టీమ్‌కు థాంక్స్‌. చాలా డిఫ‌రెంట్ కంటెంట్ కోర్టు డ్రామా. త‌ప్ప‌కుండా ఆడియెన్స్‌కి న‌చ్చుతుంది. సంప‌త్‌గారితో క‌లిసి న‌టించ‌టం అనేది క్రాష్ కోర్స్ చేసిన ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. హెబ్బాగారు న‌ట‌న‌లో సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ ఎంతో స‌పోర్ట్ చేస్తూ న‌టించారు. సినిమాటోగ్రాఫ‌ర్‌గారికి, మ్యూజిక్ అందించిన న‌రేష్‌గారికి థాంక్స్‌. నిర్మాత వెంక‌ట కృష్ణ‌గారికి థాంక్స్‌. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈరోజు రాత్రి నుంచి వ్యవస్థ జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 

డైరెక్ట‌ర్ ఆనంద్ రంగ మాట్లాడుతూ ‘‘ఎంగేజింగ్ కోర్టు డ్రామా. మ‌రో రెండు గంటల్లో వ్యవస్థ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. 

సంపత్ రాజ్ మాట్లాడుతూ ‘‘ఆనంద్ రంగ, నిర్మాత వెంకట కృష్ణ‌, ప‌ట్టాభిగారికి థాంక్స్‌. చాలా మంచి రోల్ ఇచ్చారు. కార్తీక్ ర‌త్నం, హెబ్బా ప‌టేల్‌కి అభినంద‌న‌లు. నేను అడిగే ప్ర‌శ్న‌ల‌కు క్రియేటివ్ డైరెక్ట‌ర్ లేఖ చాలా ఓపిక‌గా స‌మాధానాలు ఇచ్చేది. అందరూ హార్డ్ వ‌ర్క్ చేశారు. ఆ హార్డ్ వ‌ర్క్ వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని భావిస్తున్నాను. జీ 5 అందించిన స‌పోర్ట్‌కి థాంక్స్‌. వ్య‌వ‌స్థ‌ను జీ 5లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో కాస్ట్యూమ్ డిజైన‌ర్ ప్రియ‌ద‌ర్శిని, శ్రీతేజ, గురు రాజ్, శ్రీవాణి, సిరీస్ లీడ్ చునియా, క్రియేటివ్ లీడ్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

Share this article :