Home » » Telusa Telusa Song From Agni Nakshatra is Launched by Samantha

Telusa Telusa Song From Agni Nakshatra is Launched by Samantha

అగ్ని నక్షత్ర' లోని 'తెలుసా తెలుసా...' పాటను రిలీజ్ చేసిన సమంత

 


మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా లోని 'తెలుసా తెలుసా...' పాటను ఉమెన్స్ డే సందర్బంగా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పాటలో లక్ష్మీ ప్రసన్న తో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ మంచు కూడా కనువిందు చేయడం విశేషం. త్వరలో ఈ చిత్రం యొక్క విడుదల తేదిని ప్రకటించడం జరుగుతుంది.

ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు. మధు రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

తారాగణం :

డా మంచు మోహన్ బాబు

మంచు లక్ష్మి ప్రసన్న

సిద్దిక్

విశ్వంత్

చైత్ర శుక్ల

తదితరులు...

టెక్నిషియన్స్:

బ్యానర్ -లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌

సంగీతం -అచ్చు రాజమణి

సినిమాటోగ్రఫీ-గోకుల్ భారతి

ఎడిటర్‌-మధు రెడ్డి

దర్శకత్వం-వంశీ కృష్ణ మళ్ల 


Share this article :