Home » » BhariTaraganam Trailer Launched

BhariTaraganam Trailer Launched

 యస్.వి.కృష్ణారెడ్డి,అచ్చిరెడ్డి,ఆలీ చేతులమీదుగా గ్రాండ్ గా లాంచైన  "భారీతారాగణం" ట్రైలర్.బివిఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష నటీ నటులుగా శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బి.వి రెడ్డి నిర్మించిన చిత్రం ‘భారీ తారాగణం’. ఈ చిత్రం నుండి విడుదలైన  టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రేక్షకాదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు యస్. వి. కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.


అనంతరం గెస్ట్ గా వచ్చిన దర్శకులు యస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ..దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డి లు మంచి కంటెంట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకుని చాలా బాగా తెరకెక్కించారు..ఈ సినిమాకు సుక్కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అలీ గారు చిన్న, పెద్ద క్యారెక్టర్ అనే తేడా లేకుండా ఏ పాత్ర ఇచ్చినా కూడా ఏమాత్రం వెనకాడకుండా పాత్రలో ఒదిగిపోతారు. ఇందులో కూడా ఆలీ గారు  చాలా బాగా నటించాడు..నాకు ఇష్టమైన  బాబా గారి కొడుకు ఇందులో హీరో గా చేయడం చాలా సంతోషంగా ఉంది.సినిమా ట్రైలర్ లో  ఈ అబ్బాయిని చూస్తుంటే మన పక్కింటి అబ్బాయి లాగా చాలా చక్కగా  నటించాడు. స్క్రీన్ మీద  హీరో ధనుష్ లాగా కనిపిస్తున్నాడు. ఇందులో నటించిన వారందరూ కూడా చాలా బాగా నటించారు. త్వరలో మీ ముందుకు వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే చాలా ఫ్రెష్ గా ఉంది.ప్రతి ఫ్రెమ్ లో కూడా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఆలీ గారు ఈ సినిమాలో చాలా  చక్కగా నటించాడు ఈ సినిమా చేసిన దర్శక నిర్మాతలకు ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది ఇందులో నటించిన వారందరూ చాలా చక్కగా నటించారు త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారుకమెడియన్ ఆలీ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన దర్శక, నిర్మాతలకు  ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో మా అన్న తమ్ముడు సదన్ హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.తను ఇలాగే మంచి చిత్రాలలో నటించి పెద్ద హీరో అవ్వాలని  కోరుకుంటున్నాను. ఇందులో నాకు మంచి పాత్ర లభించింది.ఇలాంటి మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీ గా ఉందని అన్నారు.చిత్ర నిర్మాత బివి.రెడ్డి మాట్లాడుతూ..మా సినిమా ట్రైలర్ లాంచ్ కు వచ్చిన దర్శకులు యస్. వి. కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, గార్లకు ధన్యవాదాలు.సెకెండ్ కరోనా లో మా సినిమా స్టార్ట్ అయింది. అప్పటి నుండి మేము స్ట్రగుల్ పడుతూ వచ్చాము.చిన్న నిర్మాత అనుకోకుండా ఏ టైం కు పిలిచినా నటీ, నటులు  టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమాబాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న  మా చిత్రం చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.చిత్ర దర్శకులు శేఖర్ ముత్యాల మాట్లాడుతూ… మా సినిమా ట్రైలర్ లాంచ్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదములు.మా టెక్నీకల్ టీమ్ అంతా చాలా టాలెంటెడ్ పర్సన్స్,వర్క్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పని చేశారు.

లవ్ కామెడీ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇలాంటి  మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత బివి రెడ్డి గారికి ధన్యవాదములు అన్నారు 

 


చిత్ర హీరో సదన్ మాట్లాడుతూ…మా దర్శకులు శేఖర్ అన్నకు పేసెన్స్ చాలా ఎక్కువ, నిర్మాతను మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎప్పుడు కోప్పడకుండా  చాలా కూల్ గా ఉన్నారు.ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.


 

చిత్ర హీరోయిన్స్ మాట్లాడుతూ.. మన కెరియర్లో చాలా మంది మనల్ని వెనక్కి లాగాలని చూస్తుంటారు. అలాంటింది ఈ చిత్ర దర్శకులు  మమ్మల్ని నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. వారికీ మా ధన్యవాదములు అన్నారు.


 

నటీనటులు:

సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష, తదితరులు.


సాంకేతిక నిపుణులు:

బ్యానర్: బివిఆర్ పిక్చర్స్

నిర్మాత: బివి.రెడ్డి

డైరెక్టర్: శేఖర్ ముత్యాల

కెమెరామెన్: ఎమ్.వి.గోపి

సంగీతం: సుక్కు

ఆర్ట్ డైరెక్టర్: జే. కె.మూర్తి

పి. ఆర్. ఓ : మధు వి. ఆర్


Share this article :