Home » » Brahmanandam Glimpse From Rangamarthanda Launched

Brahmanandam Glimpse From Rangamarthanda Launched

 రంగమార్తాండ నుండి బ్రహ్మానందం గ్లిమ్స్ విడుదల !!! 



హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా 'రంగమార్తాండ' నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్  కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ తెరకెక్కుతుంది.


గ్లిమ్స్ లో బ్రహ్మానందం తన స్వరంతో చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ వీడియోలో బ్రహ్మానందం హాస్పిటల్​ బెడ్​పై సెలైన్ పెట్టుకుని కన్నీళ్లు నిండిన కళ్లతో.. గద్గద స్వరంతో చెప్పిన డైలాగ్ చూసి ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇటీవల రంగమార్తాండ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన షాయిరీ అలాగే రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ సాంగ్ నన్ను నన్నుగా కు మంచి స్పందన లభిచింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాకు ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు అందించగా లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు. 


https://youtu.be/BFHhGYOiqRA



డైలాగ్:  ధగధగ్గయా రాజమకుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వరా !!!

సుయోధన సౌర్వభౌమ 

శరా ఘాతలతో ఛిద్రమై

ఊపిరి ఆవిరై

దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ

అఖండ భారత సామ్రాజ్యాన్ని, 

కురుక్షత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని 

శుష్క వాగ్దానాలు వెల్లవేసిన,

ఈ దౌర్భగ్యుడుకి కడసారి దర్శనం కల్పిస్తున్నవా ???

నా దైవస్వరూపమా నన్ను క్షమించు....


Share this article :