Home » » Hero Sudheer Babu Interview About Hunt

Hero Sudheer Babu Interview About Hunt

 కృష్ణగారు 'హంట్' చూసి అప్రిషియేట్ చేస్తారనుకున్నా... సినిమా చూశా, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది! - సుధీర్ బాబు ఇంటర్వ్యూ 



నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు మీడియాతో ముచ్చటించారు. సినిమాలో మెమరీ లాస్ అయిన పోలీస్ అధికారిగా నటించారు. యాక్షన్ కొత్తగా ట్రై చేశారు. 'జాన్ విక్ 4'కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లతో పని చేశారు. ఆ విశేషాలను ఇంటర్వ్యూలతో పంచుకున్నారు. 


హాయ్ అండీ! ఎవరిని 'హంట్' చేయబోతున్నారు?

సుధీర్ బాబు : అది మీరు సినిమాలో చూడాలి. ఎవరిని 'హంట్' చేస్తున్నానని సస్పెన్స్ సినిమా అంతా ఉంటుంది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. కబీర్ సింగ్ దుహాన్, మైమ్ గోపి... ఇలా చాలా మంది ఉన్నారు. వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్ ఇది. 


శ్రీకాంత్, భరత్ ఛాయస్ ఎవరిది?

సుధీర్ బాబు : దర్శకుడు మహేష్ ఛాయస్. శ్రీకాంత్ గారిది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కానీ, ఉన్నంత సేపూ ఇంపాక్ట్ చూపిస్తుంది. సీనియర్ హీరో ఉంటే బావుంటుందని మహేష్ అనుకున్నాడు. భరత్ ఛాయస్ కూడా దర్శకుడిదే. తనకు కూడా రెండు మూడు యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. లోకల్ హీరోల కంటే భరత్ అయితే కాంబినేషన్ ఫ్రెష్ గా ఉంటుంది. 


తమిళంలో విడుదల చేసే ఆలోచన ఉందా?

సుధీర్ బాబు : ముందు అయితే లేదు. వారం క్రితం చర్చల్లో చేస్తే బావుంటుందని అనిపించింది. 'కాంతార', 'లవ్ టుడే' సినిమాలను వాళ్ళ మాతృభాషలో సక్సెస్ అయిన తర్వాత మన దగ్గర విడుదల చేశారు కదా! తెలుగులో సినిమా విడుదలైన తర్వాత మేం ఓ నిర్ణయం తీసుకుంటాం. 


మేకింగ్ వీడియో చూశాం. యాక్షన్ సీక్వెన్సుల కోసం చాలా కష్టపడ్డారు. అంత అవసరం అంటారా? రిస్క్ కదా!

సుధీర్ బాబు : నాకు రిస్క్ ఏం కాదు. రోప్స్ ఉంటేనే రిస్క్ ఎక్కువ. లేకపోతే నేనే చేస్తాను కదా! నాకు ఓ ఐడియా ఉంటుంది. ఈ సినిమా యాక్షన్ అంతా రియల్ గా ఉండాలని 'జాన్ విక్' సినిమాలను రిఫరెన్స్ తీసుకున్నాం. జాగ్రత్తలు తీసుకుని యాక్షన్ సీక్వెన్సులు చేశా. నేను స్పోర్ట్స్ పర్సన్ కావడం వల్ల ఈజీ అయ్యింది. 


మీరు ఎప్పుడైనా పోలీస్ కావాలనుకున్నారా?

సుధీర్ బాబు : లేదు. యాక్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా పోలీస్ క్యారెక్టర్ చేయాలనుకుంటారు. అర్జున్ ఎ, బి... నా పాత్రలో రెండు వేరియేషన్స్ చూస్తారు.


యాక్షన్ ఎక్కువ హైలైట్ అవుతుంది. ఎమోషన్స్ ఎలా ఉన్నాయి?

సుధీర్ బాబు : యాక్షన్ సీక్వెన్సులు ఉన్నా ఎంత వరకు ఉండాలో, అంతే ఉంటాయి. సినిమా కోర్ పాయింట్ ఎమోషనే. 


ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి?

సుధీర్ బాబు : సినిమాలో ప్రేమకథ లేదు. ఫ్రెండ్షిప్ మీద ఎక్కువ ఎమోషన్ ఉంటుంది. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎక్కువ చెప్పలేను. 


ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌ను తీసుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? 

సుధీర్ బాబు : ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజులుగా వాళ్ళను ఫాలో అవుతున్నాను. చాలా దేశాల నుంచి వాళ్ళ దగ్గరకు వచ్చి ఫైటింగుల్లో ట్రైనింగ్ తీసుకుంటారు. నేను ఓ యాక్షన్ సినిమా చేస్తే వాళ్ళ దగ్గరకు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు సినిమాలకు పని చేస్తారని తెలిసింది. ఎవరెవరు ఏయే సినిమాలకు పని చేశారో తెలియదు. రెండు నెలలు మాట్లాడాం. ముందు ఒక్కటే యాక్షన్ సీక్వెన్సు అనుకున్నారు. మేం నాలుగు అని చెబితే 12 రోజులు పడుతుందని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది అప్రోచ్ అవుతారని, చివరకు చేయరని, పేమెంట్స్ ఫస్ట్ ఇవ్వాలని చెప్పారు. మొత్తం అమౌంట్ ఇచ్చిన తర్వాత మేం ఫారిన్ వెళ్ళాం. మా కోసం వాళ్ళు డేట్స్ బ్లాక్ చేశారు. నాలుగు రోజుల్లో షూట్ చేశాం అన్ని యాక్షన్ సీక్వెన్సులు. ఇక్కడ ఎవరికైనా చూపించి నాలుగు రోజుల్లో చేశామంటే నమ్మరు. రెండు రోజులు రిహార్సిల్స్ చేశామంతే. స్టంట్స్ పరంగా మేం కొత్తగా ప్రయత్నించాం. 


కథలో కాన్‌ఫ్లిక్ట్ ఎలా అనిపించింది? గతం మర్చిపోవడం, మళ్ళీ రీకాల్ చేసుకోవడం... 

సుధీర్ బాబు : గతం మర్చిపోవడానికి ముందు... అర్జున్ ఎ క్యారెక్టర్ ఎలా ఉండాలో క్లియర్ గా ఉంది. గతం మర్చిపోయిన తర్వాత... అర్జున్ బి క్యారెక్టర్ కొంచెం కష్టం అయ్యింది. మెమరీ లాస్ మీద వచ్చిన 'గజినీ' లాంటి క్యారెక్టర్లకు పోలిక ఉండకూడదని ట్రై చేశాం.


క్యారెక్టర్ పరంగా ప్రయోగం చేశామంటున్నారు. కొత్త కాన్సెప్ట్, దర్శకుడు కూడా ఆల్మోస్ట్ కొత్త! రిస్క్ అనిపించలేదా?

సుధీర్ బాబు : మనం 50, 60 కథలు వింటుంటే ఒక మంచి పాయింట్ వస్తుంది. దాన్ని ఎందుకు వదులుకోవడం? నాకు డౌట్స్ ఉంటే ముందు ప్రశ్నలు అడుగుతా. తర్వాత టెస్ట్ షూట్ చేయమని చెబుతా. పైగా, ఈ సినిమాకు భవ్య క్రియేషన్స్ అండగా ఉంది కదా! వాళ్ళు ఉండటంతో నమ్మకం వచ్చింది. 


ఏదైనా ఒక పర్టిక్యులర్ మూమెంట్ ఉందా? ఫ్యాన్స్ థియేటర్లలో చూడాలని మీరు వెయిట్ చేస్తున్నది?

సుధీర్ బాబు : ప్రతి హీరో అటెంప్ట్ చేసే స్టోరీ కాదు. నేను ఈ విధంగా చేయడం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనేది చూడాలని ఉంది. మనం సినిమా ఎంత బాగా చేసినా... రిజల్ట్ మీద చాలా ప్రభావాలు ఉంటాయి. 


'హంట్'లో యాక్షన్ డిఫరెంట్ గా చేశారు. అది కాకుండా ఇంకా ఏదైనా అవుటాఫ్ బాక్స్ ట్రై చేసి... జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే డౌట్ ఉందా? 

సుధీర్ బాబు : సినిమా మొత్తం రిస్క్ చేశాం. ఇందులో హీరోయిన్ లేదు. మేం అక్కడే రూల్ బ్రేక్ చేశాం. రెండు నిమిషాల్లో కథలోకి వెళ్ళిపోతారు. కథ మొత్తం కొత్తగా ఉంటుంది. లాంగ్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. పేపర్ మీద కథ ఉన్నప్పుడు రిస్క్. అయితే, నేను సినిమా చూశా. వందల మంది చూశారు. మా ఫ్యామిలీ చూశారు. అందరికీ నచ్చింది. ఇప్పుడు ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్, కథలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా విజయం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది.


కృష్ణగారు ఇచ్చిన ధైర్యంతో 'హంట్' చేశానని చెప్పారు. ఎందుకలా?

సుధీర్ బాబు : ఇది డేరింగ్ అటెంప్ట్. ఇటువంటి కథ ఆయన చేసి ఉండకపోవచ్చు. కానీ, చాలా ప్రయోగాలు చేశారు. కెరీర్ అంతా కొత్తగా ట్రై చేశారు. అందుకని,  ఈ సినిమాకు ఆయన రియాక్షన్ తెలుసుకోవాలని అనుకున్నాను. ప్రతిసారీ నా సినిమా విడుదలైనప్పుడు ఆయన ఫోన్ చేయడం లేదంటే ఇంటికి పిలిచి మాట్లాడటం చేసేవారు. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' విడుదలైనప్పుడు మాట్లాడాను. అప్పుడు కూడా 'హంట్' చూసి ఏం అంటారోనని అనుకున్నాను. ఆయన అప్రిషియేట్ చేస్తారని అనుకున్నాను. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోవడంతో వెలితిగా ఉంది. 


ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

సుధీర్ బాబు : నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో 'మామా మశ్చీంద్ర' అని ఓ సినిమా చేస్తున్నాను. ఇది కామెడీ అండ్ యాక్షన్ జానర్ సినిమా. ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. అందులో ట్రిపుల్ రోల్ చేస్తున్నాను. యువి క్రియేషన్స్ లో ఇంకో సినిమా ఉంది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే డ్రామా అది. రెండు మూడు రోజుల్లో టైటిల్ అనౌన్స్ చేస్తారు.



Share this article :