దేశభక్తి నేపథ్యంలో రూపొందిన `దేశంకోసం భగత్ సింగ్` ఆడియో ఆవిష్కరణ!!
దేశంకోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఎవరూ చేయనటువంటి గొప్ప దేశభక్తి చిత్రం `దేశంకోసం భగత్ సింగ్`. గతంలో అన్నల రాజ్యం, నాగమనాయుడు, రాఘవేంద్ర మహత్యం లాంటి చిత్రాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత రవీంద్ర గోపాల `దేశం కోసం భగత్ సింగ్` చిత్రాన్ని నిర్మించారు. రవీంద్రజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించారు. ఈ చిత్రంలోని పాటలను ఈ రోజు ఫిలించాంబర్ లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల. బాబ్జీ, ప్రమోద్ శర్మ, బల్లెపల్లి మోహన్, ఘంటాడి కృష్ణ, దర్శకుడు , నటుడు, నిర్మాత రవీంద్ర గోపాల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ...``అల్లూరి సీతారామ రాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలా స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలంటే అన్న ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు. అలాంటిది సాహసం చేసి మన రవీంద్ర గోపాల్ `దేశం కోసం భగత్ సింగ్ ` సినిమాలో ఏకంగా 14 మంది స్వాతంత్ర్య సమర యోధుల పాత్రలు వేశాడు. తన మీద తనకు ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. తనకోసం కాదు.. ఇది దేశంకోసం చేసిన సినిమా. స్వాతంత్ర్య సమర యోధుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలపాలన్న తపనతో ఈ సినిమా చేశాడు. ఈ విషయంలో రవీంద్రని అభినందిస్తున్నాను. ఇటీవల సినిమా చూశాను. ప్రతి పాత్రకు న్యాయం చేశాడు. ఇందులో పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధించి మరెన్నో మంచి చిత్రాలు చేసే ప్రోత్సాహాన్ని ప్రేక్షకులు కల్పించాలని కోరుకుంటున్నా`` అన్నారు.
ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ...``ప్యాషన్ తో సినిమా చేశాను అనే పదం మనలో చాలా మంది ఏదో ఫ్యాషన్ కోసం వాడుతుంటారు. కానీ నిజంగా రవీంద్ర గారు `దేశంకోసం భగత్ సింగ్ ` సినిమా ప్యాషన్ తో చేశారు. డబ్బు కోసమే సినిమా తీసే ఈ కాలంలో దేశం కోసం సినిమా చేయడం అభినందిదగ్గ విషయం. నేటి తరానికి గాంధీ, భగత్ సింగ్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తే ఎంతో మంది త్యాగఫలం..మన స్వాతంత్ర్యం అనే విషయం వారికి తెలుస్తుంది. దేశభక్తితో ఈ సినిమా తీసిన రవీంద్ర గారిని అభినందిస్తూ ..ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించి ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో నిర్మించాలని కోరుకుంటున్నా`` అన్నారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి మాట్లాడుతూ...``సినిమా చూశాక రవీంద్ర గోపాల్ పడ్డ కష్టం కనిపించింది. పాటలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన గొప్ప దేశభక్తి చిత్రమిది`` అన్నారు.
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ...``35 ఏళ్లుగా నాకు రవీంద్ర గోపాల్ తెలుసు. డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా సినిమా రంగంలో ఎంతో అనుభవం ఉంది. కమర్షియల్ సినిమాల కాలంలో దేశం కోసం సినిమా చేసిన రవీంద్ర గోపాల్ ని అభినందించి, ఈ సినిమాను ఆదరించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. దేశభక్తి తనలో ఉంది కాబట్టే దేశభక్తి సినిమా రవీంద్ర చేశాడు. ప్రతి పాటలో దేశభక్తి ఉట్టిపడుతోంది. ఈ సినిమా సక్సెస్ సాధించి రవీంద్ర ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు చేయాలన్నారు.
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ...``ఇందులో 14 పాత్రలు కూడా గొప్పవే. పాటలు చాలా బావున్నాయి. ఇంత మంచి సినిమా చేసిన రవీంద్రను అభినందస్తూ ఈ చిత్రం బాగా ఆడాలన్నారు.
రచయిత వడ్లేపల్లి కృష్ణ మాట్లాడుతూ...``ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా బాల బాలికలకు ఈ సినిమా చూపిస్తే ...మన స్వాతంత్ర్య సమర యోధుల త్యాగం గురించి ఈ తరం వారికి తెలుస్తుంది. కమర్షియల్ కాలంలో క్లాసిక్ సినిమా చేసిన రవీంద్ర గోపాల్ ని అభినందిస్తున్నా`` అన్నారు.
దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ...``రవీంద్ర గోపాల్ గారి నరనరాల్లో దేశభక్తి ఉంది కాబట్టే ఇంత గొప్ప దేశభక్తి సినిమా చేశారు`` అన్నారు.
చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు రవీంద్ర గోపాల్ మాట్లాడుతూ...``ఒక మంచి సినిమా చేయాలన్న కసితో చేసిన సినిమా ఇది. ఇటీవల మా చిత్రం ట్రైలర్ ఆవిష్కరించి.. మమ్మల్ని ఆశీర్వదించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారికి ధన్యవాదాలు. సినిమాను ఫిబ్రవరి 3న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
సంగీత దర్శకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ...`` ఇందులో 7 పాటలున్నాయి. ప్రతి పాటను నాతో అద్భుతంగా చేయించిన రవీంద్ర గారికి ధన్యవాదాలు`` అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఘంటాడి కృష్ణ, బల్లెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కెమెరాః సి. వి. ఆనంద్, సంగీతంః ప్రమోద్ కుమార్, మాటలుః సూర్యప్రకాష్,రవీంద్ర గోపాల, పాటలుః రవీంద్ర గోపాల, పీఆర్వోః రమేష్ చందు, ఎడిటింగ్ః రామారావు, కోడైరెక్టర్ః రామారావు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాతః రవీంద్రజి.
Post a Comment