Home » » Chudu Chudu Song From Rajayogam Movie Released by Hero Srikanth

Chudu Chudu Song From Rajayogam Movie Released by Hero Srikanth

 "రాజయోగం" సినిమాలోని 'చూడు చూడు' పాటను విడుదల చేసిన హీరో శ్రీకాంత్



సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "రాజయోగం" . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఒక వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.


తాజాగా ఈ సినిమాలోని 'చూడు చూడు' పాటను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా అరుణ్ మురళీధరన్ స్వరపర్చారు. కౌషిక్ మీనన్, నిత్యా మమ్మెన్ పాడారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ..."రాజయోగం" టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాను గ్రాండ్ గా సినిమాను తెరకెక్కించారు. చూడు చూడు పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పాట సౌండింగ్, పిక్చరైజేషన్ ఆకట్టుకున్నాయి. పేరుకు తగ్గట్లే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.


ఇటీవల దర్శకుడు మారుతి విడుదల చేసిన "రాజయోగం" ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటలు, ట్రైలర్ బాగుండటంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.


అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - విజయ్ సి కుమార్, ఎడిటర్ - కార్తీక

శ్రీనివాస్, సంగీతం - అరుణ్ మురళీధరన్, డైలాగ్స్ - చింతపల్లి రమణ, పీఆర్వో - జీఎస్కే మీడియా, సహ నిర్మాతలు - డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్, నిర్మాత - మణి లక్ష్మణ్ రావు, రచన దర్శకత్వం - రామ్

గణపతి.



Share this article :