దీపావళి రోజున ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యువ హీరో 'రాజ్ దాసిరెడ్డి'
తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి అగ్ర దర్శకులలో ఒకరిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు మారుతి. అయన సారథ్యంలో రూపొందిన "భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు"చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ పరిచయమై ఆ సినిమా ద్వారా తనకంటూ కొత్త ఇమేజ్ ను తెచ్చుకొని అందరి ప్రేక్షకుల ఆధారాభిమానాలు పొందిన యువ హీరో రాజ్ దాసిరెడ్డి. తాజాగా తెలుగులో ఒక అగ్ర నిర్మాత నిర్మిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే రాజ్ దాసిరెడ్డి ని ఒక హై ప్రొఫైల్ ఇంటర్నేషనల్ టాలెంట్ ఏజెన్సీ ప్రాతినిధ్యం వహిస్తుంది. USA సంబంధించిన ఈ టాలెంట్ ఏజెన్సీ చాల మంది హాలీవుడ్ తారలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇలాంటి హై ప్రొఫైల్ ఉన్న టాలెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని ఒకవైపు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే మరో వైపు హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్న రాజ్ దాసిరెడ్డి అమెరికాలో వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఈ యువ హీరో రాజ్ దాసిరెడ్డి పుట్టినరోజు (అక్టోబర్ 24న). అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం తన పుట్టిన రోజున దీపావళి రావడం విశేషం.ఈ దీపావళి రోజున తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్బంగా
యువ హీరో రాజ్ దాసి రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికి దీపావళి శుభాకాంక్షలు.ఇంతకు ముందు మారుతి గారి దర్శకత్వంలో హీరో గా నటించిన "భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు"చిత్రం నాకు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది.ఈ సినిమా ద్వారా నన్ను గుర్తించి ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం నేను చేసిన ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. USA కుసంబందించిన అంతర్జాతీయ ప్రాజెక్టులో నిర్మించే హాలీవుడ్ సినిమమాతో అలాగే తెలుగులో ఒక మంచి లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాను.ఈ సంవత్సరం నా పుట్టినరోజు నాడు దీపావళి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు నన్ను ఆదరించినట్లే ఇకముందు రాబోయే నా చిత్రాలను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు సినీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
Post a Comment