Prime Video Ammu Trailer Launched

 డ్రామా థ్రిల్లర్ గా రాబోతున్న ఐశ్వర్య లక్ష్మి, నవీన్  చంద్ర "అమ్ము" చిత్ర ట్రైలర్ విడుదల



ఐశ్వర్య లక్ష్మి (Ishwarya Laxmi) ప్రస్తుతం తన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ (PS-1)లో తన పూంగుజాలి పాత్రతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తన రాబోయే చిత్రం "అమ్ము" (Ammu movie) లో కనిపించనుంది. ‘అమ్ము’ గ్రిప్పింగ్, ఎమోషనల్ థ్రిల్లర్ గా అక్టోబర్ 19న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఓటీటీ వేదికలకు మంచి డిమాండ్ చేకూరిన సంగతి తెలిసిందే. చాలా సినిమాలు ఓటీటీ విడుదలై కూడా సక్సెస్ సాధించాయి. ఇప్పుడు అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైంది ఈ అమ్ము మూవీ.


ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది.  తాజాగా ఈ అమ్ము చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ట్రైలర్ ఈ  సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. గృహ హింసకు గురైన ఒక అమ్మాయిగా ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో కనిపిస్తుంది. నవీన్ చంద్ర ఈ సినిమాలో అమ్ము భర్తగా నటించాడు.భార్య భర్తల అనుబంధంతో పాటు వాళ్ళ మధ్య జరిగే గొడవలను కూడా ఆవిష్కరించాడు దర్శకుడు. 

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతుంది.  రిలీజ్ చేసిన ఈ ట్రైలర్  చూస్తుంటే ఈ చిత్రం ఒక డ్రామా థ్రిల్లర్ అని తెలుస్తోంది.



కార్తీక్ సుబ్బరాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, చారుకేష్ శేఖర్ రచన & దర్శకత్వం మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ డ్రామా థ్రిల్లర్‌లో ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర మరియు సింహా నటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 19న విడుదల కాబోతున్న ఈ అమ్ము మూవీ కోసం  ప్రేక్షకులు  ఎదురుచూస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post