Trivedh Creations Satyam Vadha Dharmam Chera Movie Launched

 ఒంగోలులో శ్రీకారం చుట్టుకున్న

త్రిదేవ్ క్రియేషన్స్

"సత్యం వధ - ధర్మం చెర"



     త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై బాబు నిమ్మగడ్డ దర్శకత్వంలో శ్రీమతి రమాదేవి నిమ్మగడ్డ నిర్మిస్తున్న కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం "సత్యం వధ - ధర్మం చెర". ఒంగోలు, గోపాలస్వామి కన్వెన్షన్ హాల్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రమణారెడ్డి-పూజలపై చిత్రీకరించిన ముహర్తపు సన్నివేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా హనుమంతరావు క్లాప్ కొట్టగా... రవి శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రమేష్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. మార్వెల్ గ్రైనేట్స్ అధినేత సూదనగుంట కోటేశ్వరరావు గౌరవ దర్సకత్వం వహించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతూ తెరకెక్కుతున్న "సత్యం వధ - ధర్మం చెర" ప్రేక్షకులతో ఆలోచింపజేస్తూనే అమితంగా అలరిస్తుందని దర్శకుడు బాబు నిమ్మగడ్డ అన్నారు.

      స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, బిందు భార్గవి, మమతారెడ్డి, బిందుకృష్ణ, మధుబాల, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్, అనంతలక్ష్మి, రమేష్ రాజా ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్. ఓ: ధీరజ-అప్పాజీ, డిజైనర్: కోడి ఎన్.ప్రసాద్, కాస్ట్యూమ్స్: నాగరాజు, మేకప్: ఆర్.జగదీష్, కొరియోగ్రఫీ: ఆర్.కె., ఆర్ట్: జె.ఎన్.నాయుడు, కో-డైరెక్టర్: ఎమ్.బాలసుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్ మేనేజర్: రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.కె.పి. చౌదరి, సమర్పణ: వై.కొండయ్య నాయుడు, నిర్మాత: శ్రీమతి రమాదేవి నిమ్మగడ్డ, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్సకత్వం: బాబు నిమ్మగడ్డ!!

Post a Comment

Previous Post Next Post