Home » » Draupadi Audio Launched

Draupadi Audio Launched

 ‘ద్రౌపది’ డబ్బులొచ్చే సినిమాగా పెద్ద సక్సెస్ కావాలి: ఆడియో వేడుకలో సెవెన్ హిల్స్ బ్యానర్ నిర్మాత  సతీష్ కుమార్.



శ్రీ సంతోషి మా క్రియేషన్స్, చతుర శ్రీ సమర్పణలో.. శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్ బ్యానర్లపై.. ‘తిన్నామా పడుకున్నామా తెల్లారిందా!’ చిత్ర ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వంలో బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తోన్న చిత్రం ‘ద్రౌపది’. ‘నాకు కూడా ఐదుగురే’ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెవెన్స్ హిల్స్ బ్యానర్ అధినేత సతీష్ కుమార్

.. బిగ్ సీడీని ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఇండస్ట్రీలో నిర్మాత బాగుంటేనే అందరూ బాగుంటారు. నిర్మాతలకి డబ్బులు వస్తేనే.. మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. అలా డబ్బులు వచ్చే విధంగా నా మిత్రుడు రామ్ కుమార్ ఈ సినిమాని తీశాడని అనుకుంటున్నాను. ఈ సినిమాలో  అంతా కొత్తవారి తో రామ్ కుమార్ నటింపజేశారు. అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని, అలాగే నిర్మాతకి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటూ.. యూనిట్‌కు ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు. 


నిర్మాత బొడ్డుపల్లి బ్రహ్మచార్య మాట్లాడుతూ.. ‘‘నేను స్వతహాగా స్వర్ణశిల్పిని. నాకు మహమ్మాయి అమ్మవారి చరిత్రపై సినిమా తీయాలనేది కోరిక. అయితే అది గ్రాఫిక్స్ పరంగా ఖర్చు తో కూడుకున్నది కావడంతో దర్శకుడు రామ్ కుమార్ చెప్పిన కథ బాగా నచ్చడంతో నా మొదటి సినిమాగా , మంచి కంటెంట్, కాన్సెప్ట్‌తో ‘ద్రౌపది’ టైటిల్‌తో ఈ సినిమా తీయడం జరిగింది. తర్వాత మహమ్మాయి అమ్మవారిపై సినిమా ఉంటుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. భూమితల్లిని అమ్మి.. కళామతల్లిని నమ్మి.. ఈ ఫీల్డ్‌లోకి అడుగుపెడుతున్నాను. అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. అంతా కొత్తవారితో ఈ సినిమా తీశాము. వారందరికీ ముందు ముందు మంచి అవకాశాలు వచ్చి..మంచి ఆర్టిస్టులుగా స్థిరపడిపోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు. 


దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘పిలవగానే ఈ వేడుకకు వచ్చి మా టీమ్‌ని బ్లెస్ చేసిన సతీష్ కుమార్ అన్నకి ధన్యవాదాలు. నిర్మాతగా మీరు మరింత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. సినిమా విషయానికి వస్తే.. మంచి కాన్సెప్ట్‌తో చేసిన ప్రయోగమిది. అంతా కొత్తవారితో చేయడం జరిగింది. సాంగ్స్ కూడా ఎక్కడా రాజీ పడకుండా.. రామోజీ ఫిల్మ్ సిటీలో పిక్చరైజ్ చేశాము. అలాగే జగిత్యాలలో ఓ సాంగ్ చేశాము. మ్యూజిక్ డైరెక్టర్స్ రవి, జయసూర్య చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మేము ఏది అడిగితే అది సమకూర్చారు. ఆయనకి ఈ సినిమా మంచి పేరుని, ధనాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘ద్రౌపది’ అనే బలమైన పాత్రలో సాక్షి చక్కగా చేసింది. ఫస్ట్ సినిమా తనకి.. అయినా కూడా అందరినీ మెప్పించింది. సహకరించిన టీమ్ అందరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను..’’ అని అన్నారు. 


ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ"ఏ బాకింగ్ లేని నేను ఈ రోజున హీరోయిన్ గా నిలబడినానంటే దానికి కారణం మా దర్శకుడు రామ్ కుమార్ గారే   ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అని అన్నారు. 

, మ్యూజిక్ డైరెక్టర్ రవి, సాయికుమార్ దేవరకోట తదితరులు మాట్లాడుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.


సాక్షి, రాజేంద్ర, దేవిశ్రీ, శ్రావణ సంధ్య, కట్ట శివ, శ్రీనివాసాచారి, అజయ్ కుమార్.. తదితరులు నటించిన ఈ చిత్రానికి

డైలాగ్స్: అశోక్ వడ్లమూడి

డ్యాన్స్: ఉమా శంకర్

సినిమాటోగ్రఫీ: డి. యాదగిరి

ఎటిటర్: నాగిరెడ్డి.వి.

మ్యూజిక్: జయసూర్య బొంపెం, రవి ములకలపల్లి

కథ: రామ్ కుమార్, అశోక్ వడ్లమూడి

సహనిర్మాతలు: బొడ్డుపల్లి సంతోష్, సంపత్, సంకీర్త్

పీఆర్వో: బి. వీరబాబు

నిర్మాత: బొడ్డుపల్లి బ్రహ్మచార్య

కథనం మరియు దర్శకత్వం: రామ్ కుమార్.


Share this article :