ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు , ఫిలిం ఛాంబర్ సెక్రటరీ & నిర్మాత దామోదర్ ప్రసాద్ ల చేతుల మీదుగా విడుదలైన "చింతామణి సొంత మొగుడు" ట్రైలర్
శ్రీ స్కందాగ్రజ పతాకంపై రాజేంద్ర ప్రసాద్ (జూనియర్ పవన్ కళ్యాణ్ ), మధు ప్రియా (మగువ ఫెమ్ ) జంటగా శివ నాగేశ్వరావు వీరేళ్ళ స్వీయ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం "చింతామణి సొంత మొగుడు". శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో చిత్ర యూనిట్ చిత్ర ట్రైలర్ ను,పాటలను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా,ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి లు ఈ చిత్రంలోని పాటలను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..ట్రైలర్ చూశాను చాలా బాగుంది. ఒక పెద్ద స్టార్ పోలికలు తో ఉన్న వ్యక్తి ఇందులో మంచి కీ రోల్ చేస్తున్నాడు అంటే ఈ కథకు తను మంచి యాప్ట్ అయ్యివుంటాడు. ఇందులోని పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇలాంటి చిన్న సినిమాలు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది అని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్ర దర్శక, నిర్మాత శివ నాగేశ్వరావు వీరేళ్ళ కు మరియు చిత్ర యూనిట్ కు అల్ ద బెస్ట్ అన్నారు.
ముఖ్య అతిధిగా వచ్చిన ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ..మా మోహన్ గౌడ్ గారు వచ్చి మాకు ఈ ట్రైలర్ చూయించడం జరిగింది. మాకు చాలా నచ్చింది.తను పిలిచిన వెంటనే మేము రావడం జరిగింది. దాము గారు ట్రైలర్ రిలీజ్ చేస్తే నేను పాటలు రిలీజ్ చెయ్యడం జరిగింది.టెక్నీకల్ వ్యాల్యూస్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి తక్కువ బడ్జెట్ లో మంచి ఔట్ పుట్ ఉన్న సినిమా తీశారు.దీనికోసం వీరు ఎంత హార్డ్ వర్క్ చేశారో అనేది నాకు తెలుస్తుంది.ఇలాంటి మంచి సినిమా తీసినందుకు చాలా సంతోషంగా ఉంది.చిన్న సినిమాలకు మేము ఎప్పుడూ అండగా ఉంటాము. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించి చిత్ర దర్శక,నిర్మాతకు చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని అన్నారు.
చిత్ర దర్శక, నిర్మాత శివ నాగేశ్వరావు వీరేళ్ళ మాట్లాడుతూ...శ్రీ స్కందాగ్రజ బ్యానర్ పై నిర్మించి, దర్శకత్వం వహిస్తున్న చిత్రం "చింతామణి సొంత మొగుడు"ఈ సినిమాలో హీరోగా రాజేంద్ర ప్రసాద్ జూనియర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రూపం తో పాటు వాయిస్ కూడా సేమ్ అలాగే ఉండటంతో అందరూ తనని జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తుంటారు. తనకు జోడీగా మగువ సినిమాలో హీరోయిన్ గా నటించిన మధు ప్రియ నటిస్తున్నారు. "చింతామణి సొంత మొగుడు" అంటే కొంతమంది వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది ఆర్టిస్టులు ఉన్న ఈ సినిమాలో ఎవరు చింతామనికి సొంత మొగుడు అవుతారు అనేదే సస్పెన్స్.అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా తెరకెక్కించడం జరిగింది.చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇందులో ఉన్న నాలుగు సాంగ్స్ కూడా మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాము. అయితే ఇప్పటివరకు మూడు పాటలు, ఒక ట్రైలర్, టీజర్ రిలీజ్ అయ్యాయి. మిగిలిన ఒక పాటను త్వరలో రిలీజ్ చేస్తాము. పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయి ఫైనల్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను
చిత్ర హీరో రాజేంద్ర ప్రసాద్ (జూనియర్ పవన్ కళ్యాణ్ ) మాట్లాడుతూ : ఒక సామాజిక స్పృహ,సమాజం పట్ల బాధ్యత కలిగి సినిమా రంగం పై ఉన్నటువంటి మక్కువతో ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా ఇలా రెండు తనే చేస్తూ ఎంతో వ్యయ ప్రయాసలతో దర్శక, నిర్మాత శివ నాగేశ్వరావు వీరేళ్ళ మంచి కంటెంట్ ను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇలాంటి మంచి సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించి నందుకు వారికి నా కృతజ్ఞతలు. సినిమాపై ఉన్న ప్యాషన్ తో తను అనుకున్న కంటెంట్ రావాలనే పట్టుదలతో టీమ్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ సినిమా కొరకు చాలా కష్టపడ్డాడు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. ఇందులో ప్రతి సన్నివేశం ఎంతో హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు సమాజానికి చాలా అవసరం. అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో చూస్తాం.ఈ సినిమా ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న దర్శక, నిర్మాత శివ నాగేశ్వరావు వీరేళ్ళ గారికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో పని చేసిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా కళ్యాణ్ అన్న అభిమానులు అందరూ ఈ సినిమాను ఆదరించి విజయం సాధించేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
విలన్ గా నటించిన ఆనంద్ భారతి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జబర్దస్త్ అప్పారావు, చిట్టి బాబు, ఎం ఎస్ నాయుడు, చెన్నకేశవ, అవంతిక, ప్రియాంక,ఇలా అందరూ పాల్గొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు
నటీనటులు
రాజేంద్రప్రసాద్ (జూనియర్ పవన్ కళ్యాణ్), మధు ప్రియా (మగువా ఫేమ్), జబర్దస్త్ ఫేమ్ అప్పారావు, చిట్టి బాబు, ఆనంద్ బారతి ,రమేష్ బాబు, జయసింహ మహార , అవంతిక, ప్రియాంక,ఎన్ఎస్ నాయుడు, చెన్నకేశవ,
స్టిక్ మనోహర్, హరిబాబు, వీర శంకర్ యాదవ్, నరేంద్ర,
ప్రకర్ష, లక్కీ, కీర్తి,కవిత, లక్ష్మి, రాజు,చందు తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : శ్రీ స్కందాగ్రజ పతాకం
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : శివ నాగేశ్వరావు వీరేళ్ళ
కో డైరెక్టర్ : సవరం శివరాం కుమార్
కెమెరామెన్ : రమణ
మ్యూజిక్,రీ-రికార్డింగ్ : యం.యల్.రాజ
పి. ఆర్. ఓ : మధు వి. ఆర్
ఎడిటింగ్,డబ్బింగ్, డి ఏ : చింటూ గ్యాంగ్ స్టూడియో గుంటూరు
కొరియోగ్రాఫర్ : మహేష్
స్కోర్ వొకల్స్ ఫిమేల్ : శ్రీవిద్య మలహరి, భారతి, అనూష, వైశ్య దరి,విజయ భవ్య శ్రీ నిధి,
స్కోర్ వొకల్స్ మేల్ : రాజా, బి. మురళీకృష్ణ, శివ, భూపతి, శ్రీనివాస్
పెర్కషన్స్ : చిరంజీవి మోతుకూరి
సౌండ్ ఎఫెక్ట్స్ : నాగరాజ్
ఫోలీ : శ్రీను
స్కోర్ ప్రీ మిక్స్ : మోహిత్ చోర్డ్స్
దట్స్ అండ్ స్టీరియో మిక్స్ : నాగరాజ్
లిరిక్స్ : శ్రీ విజయ వెగేశ్న, అంచుల నాగేశ్వరరావు
సింగర్స్ : యం. యల్ రాజా, శ్రీవిద్య మలహరి, లక్ష్మి శ్రావణి
ఫైట్ మాస్టర్ : హుస్సేన్