ఆగస్ట్ 26న ‘భళా చోర భళా’ థియేటర్లలో విడుదల
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న చిత్రం ‘భళా చోర భళా’. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మిస్టరీ చిత్రానికి ఏ. ప్రదీప్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 26న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు ఖయ్యుమ్ మాట్లాడుతూ.. ‘‘ఈనెల 26న మా భళా చోర భళా చిత్రం విడుదల కాబోతోంది.. కంప్లీట్ నెపోటీజమ్ సినిమా అనొచ్చు.. ఎందుకంటే ఇందులో అందరం సీనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన వాళ్ళమే ఉన్నాం.. ప్రదీప్ నాకు ఏవీఎస్‌గారి అబ్బాయిగా 20ఏళ్ల క్రితమే తెలుసు.. మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇద్దరికీ... ఆ స్నేహంతోనే ఇద్దరం కలిసి వర్క్ చేయాలనుకున్నాం. కోవిడ్ టైం లోనే ప్రదీప్ నాకు స్టోరీ చెప్పారు. వినగానే నాకు బాగా నచ్చింది. కథ నచ్చిన రెండో రోజే షూటింగ్ అన్నాడు. 8 నైట్స్, 9డేస్‌లో షూట్ కంప్లీట్ చేసి 2మంత్స్ లో పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా పూర్తి చేసి రిలీజ్‌కి సిద్ధం చేశాడు. మంచి సినిమా ఇది. ఆదరిస్తారని ఆశిస్తున్నాను..’’ అన్నారు.
‘అవును’ ఫేమ్ చంటి మాట్లాడుతూ... ఈ సినిమాలో నేను నెగటివ్ రోల్ ప్లే చేశాను.. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాంటి కంటెంట్ మా చిత్రంలో ఉంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎవరినీ డిజప్పాయింట్ చేయదు అని నమ్మకంగా చెప్పగలను అన్నారు.
డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. తక్కువ బడ్జెట్‌లో లిమిటెడ్ డేస్‌లో మంచి సినిమా చేయాలని ప్లాన్ చేశా. అదే ‘భళా చోర భళా’గా మీ ముందుకు రాబోతోంది. మా నాన్న ఏవిఎస్ గారిపై ఉన్న అభిమానం వల్ల సినిమాకు సంబంధించిన వారందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన లేకపోయినా మాకు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమాను ఆగస్ట్ 26న మా అమ్మగారి పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నాము. అందరికీ మా సినిమా నచ్చుతుందని భావిస్తున్నా.. అలాగే ఈ సినిమాలో నేను కూడా రోల్ చేశాను. చాలా తక్కువమంది ఆర్టిస్టులతో చేసిన సినిమా ఇది.. అని చెప్పారు.
ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, చిత్రం శ్రీను, వెంకటేష్, రవి కిరణ్, రవి శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్,
ఎడిటర్: వెంకటేష్,
ఆర్ట్: రవితేజ నిమ్మన,
సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్ అద్దంకి;
పీఆర్వో: బి. వీరబాబు,
నిర్మాత: ఏ. జనని ప్రదీప్,
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఏ. ప్రదీప్.