Lakshmi Prasanna Pictures and Manchu Entertainments New Movie Launched

 పూజా కార్యక్రమాలు జరుపుకున్న లక్ష్మీప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్టైన్మెంట్ కొత్త సినిమా



శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ & మంచు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఈ రోజు (ఫిబ్రవరి 12) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యింది. మహిళా దర్శకురాలు నందినిరెడ్డి ఫస్ట్ షాట్ కి దర్శకత్వం వహించగా, మంచు మనోజ్ కెమెరా స్విచ్ఛాన్ చేసారు. మంచు అవరామ్, మంచు విద్యా నిర్వాణ స్ర్కిఫ్ట్ అందజేసారు.  


మొట్టమొదటిసారి 'పద్మశ్రీ’ డా॥ మోహన్ బాబు, మంచు లక్ష్మీప్రసన్న ఈ చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మళయాళం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సిద్దిక్ కీలక పాత్ర పోషించబోతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహించబోతున్నారు. డైమండ్ రత్నబాబు స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి కెమెరామెన్ సాయిప్రకాష్, మ్యూజిక్ ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం.


ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ - “ఇది ఒక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్. పద్మశ్రీ డా॥ మోహన్ బాబు, మంచు లక్ష్మి మునుపెన్నడూ కనిపించని పాత్రల్లో కనిపించనున్నారు. మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం'' అని చెప్పారు. 


Post a Comment

Previous Post Next Post