‘భీమ్లా నాయక్’ మాస్ జాతర చూడ్డానికి మేం కూడా ఎదురు చూస్తున్నాం: వరుణ్ తేజ్ ‘గని’ చిత్ర యూనిట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. Renaissance పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌లో సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ. ఈ సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ రానుండటంతో గని సినిమాను వాయిదా వేసారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసారు. ‘మా ‘గని’ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుండటంతో.. మా సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మాస్ జాతర థియేటర్స్‌లో చూడ్డానికి మీలాగే మేం కూడా ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే ‘గని’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తాం..’ అంటూ తెలిపారు.
నటీనటులు:
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కిరణ్ కొర్రపాటి
నిర్మాతలు: సిద్దు ముద్ద, అల్లు బాబీ
సమర్పకుడు: అల్లు అరవింద్
సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సంగీతం: థమన్
పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను
Post a Comment