Home » » Actor Shivaji Raja Interview

Actor Shivaji Raja Interview

 నటుడిగా ఇప్పుడున్న సంతృప్తి చాలు : సీనియర్ నటుడు శివాజీ రాజా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు దర్శకత్వంలో కళ్ళు అనే నాటిక ఆధారంగా కళ్ళు పేరుతొ రూపొందిన చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు శివాజి రాజా. ఈ సినిమా ద్వారా  ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ఆ తరువాత సపోర్టింగ్ నటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. గుణ్ణం గంగరాజు నిర్మాణ సారథ్యంలో జెమినీ టీవీలో ప్రసారమై బాగా ప్రాచుర్యం పొందిన అమృతం ధారావాహికలో కొన్ని ఎపిసోడ్లలో  అమృతం పాత్రను పోషించాడు. నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన శివాజి రాజా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. ఈ రోజు ఫిబ్రవరి 26న శివాజీ రాజా జన్మదినం సందర్బంగా మీడియాతో అయన మాట్లాడారు. ఆ విశేషాలు అయన మాటల్లో .. 


సినిమా రంగంలోకే నేను ఎంట్రీ ఇచ్చి దాదాపు 37 సంవత్సరాలు అయింది. నేను మద్రాసులో కెరీర్ మొదలెట్టాను. 1985 ఫిబ్రవరి 24తో చెన్నై లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను . చాలా మంది సినిమా వాళ్లతో నాకు దగ్గరి అనుబంధం ఉంది. నా అసలు పేరు శివాజీ రాజు.. కానీ ఒకరోజు ఏచూరి గారు అడిగి.. శివాజీ రాజు ఏమిటి రాజా అని పెట్టు అని చెప్పగా.. ప్రెస్ లో నా పేరు శివాజీ రాజాగా మారిపోయింది. సో నా పేరు మార్చింది మీడియా వాళ్ళే. నేను ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, వట్టి చేతులతో వచ్చాను. మనం ఎంత మంచి పేరు సంపాదించుకుంటే అంత మంచి పేరొస్తుంది. మొన్న పునీత్ చనిపోయినప్పుడు నాలుగు రాష్ట్రాలు కదిలొచ్చాయి. అంతకంటే మంచితనం ఇంకా ఏముంది. ఇక నటుడిగా నేను దాదాపు 500 సినిమాలకు పైగా నటించాను. నటుడిగా భిన్నమైన సినిమాలు, పాత్రలు చేశాను. మొన్న కరోనా వచ్చినప్పుడు నా శక్తికి మించి నిత్యావసర వస్తువులు చాలా మందికి సరఫరా చేసాం. నిత్యావసర వస్తువులు.. అన్ని కలిపి పంపించాం.. అందులో కలిగిన సంతృప్తి నాకు ఎక్కడ దక్కలేదు. నేను మా అసోసియేషన్ లో ప్రసిడెంట్ గా చేశాను.. అలాగే అంతకు ముందు అన్ని శాఖల్లో పనిచేసాను. నేను పనిచేసినప్పుడు పింఛన్ వెయ్యి రూపాయలు ఉన్నదాన్ని ఐదువేలు అందేలా చేశాను. నేను మరోసారి మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటె ఓల్డేజ్ హోమ్ కట్టాలన్న ఆలోచన ఉండేది కానీ దానిపై నీళ్లు చల్లారు. నేను  చిరంజీవి గారితో కలిసి పదిమంది స్టార్స్ ని తీసుకెళ్లి డల్లాస్ లో షో చేసినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. చిరంజీవి గారిని విదేశాలకు తీసుకెళ్లి ఆయనను మళ్ళీ జాగ్రత్తగా హైదరాబాద్ పంపించాకే రిలాక్స్ అయ్యాను. నేను ఏ కార్యక్రమం చేసిన అంత బాధ్యతగా చేశాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో నేను ఇరవై ఏళ్లుగా రకరకాల బాధ్యతలు నిర్వర్తించాను. చాలా మంది ప్రముఖులు ఫోన్ చేసి అభినందించడం చాలా తృప్తి ఇచ్చింది. నా కెరీర్  అరవై ఏళ్ళు వచ్చిన సందర్బంగా శివాజీ రాజా చారిటబుల్ ట్రస్ట్ పై పేద కళాకారులకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది. మొగిలయ్య లాంటి కళాకారుల ప్రతిభ గుర్తించి సపోర్ట్ చేస్తే వాళ్ళ జీవితాలు మారతాయి. మొగిలయ్య కు దక్కిన గౌరవానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే ఆయనను గుర్తించి అవకాశం ఇచ్చిన  పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్. ఇలాంటి కళాకారులూ మరింత మంది వెలుగులోకి వస్తే బాగుంటుంది. అందుకే  మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి చాలా మంది పేద కళాకారులూ ఉన్నారు. వారిని నేను ప్రోత్సహించేందుకు సిద్ధం అయ్యాను. 


నేను నటుడిగా సినిమాలు చేస్తూనే నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. నిజం చెబితే మీరు నమ్మరు.. మణికొండ మెయిన్ సెంటర్ లో నాకున్న కొద్దీ స్థలంలో వరిపంట, మొక్కజొన్న, జొన్న ఇలా చాలా రకాల పంటలు పండించాను. ఈ మద్యే మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. ఉన్న స్థలంలో అన్ని రకాల పంటలు వేసాను. ఆ ప్రాంతంలో ద్రాక్ష పంట పండదు.. కానీ అక్కడ నేను పంట వేసి చూపించాను. అలా అక్కడ ఈ పంట పండదు అంటే అక్కడ ఆ పంట పండించాలని ఆలోచన నాది. 


ఇప్పుడు మా అసోసియేషన్ గురించి నేనేమి చెప్పలేను. ఎందుకంటే మంచి అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా వాడుకోవాలి. నిజానికి మురళీమోహన్ గారు ఐదు సార్లు ప్రసిడెంట్ గా చేసారు.. కానీ అయన తలచుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ చేయలేదు. మురళీమోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టం, కానీ అయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు అని నా అభిప్రాయం.  నేను మా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ డబ్బులు, ఫోన్స్ పంచామని ప్రచారం చేసారు. ఇక్కడ కొందరు బీరు, బిర్యానీలకు కక్కుర్తి పడి  పార్టీలు మారుస్తారు. అలాంటి వారికోసం నేను ఎందుకు కష్టపడాలి అనిపించేది.  ప్రస్తుతం నేను ఎఫ్ ఎం సిసి క్లబ్ కు హయ్యెస్ట్ మెజారిటీ తో గెలిచి వైస్ ప్రసిడెంట్ గా ఉన్నాను. కానీ ఇక్కడ నేను ఏమి చేయడం లేదు.. పెద్దలు ఉన్నారు ఆదిశేష గిరిరావు, కె ఎస్ రామారావు లాంటి వారు ఉన్నారు, వారు అన్ని చూసుకుంటారు. 


ఈ మధ్య నాకు హెల్త్ బాగోలేక కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. ఈ మద్యే అందరికి కరోనా వచ్చింది. ప్రస్తుతం ఆరోగ్యపరంగా బాగున్నాను.  ఇప్పుడు తెలుగు సినిమా గ్రేట్ వె లో ముందుకు సాగుతుంది. నేను మొదటినుండి చిరంజీవి గారి అభిమానినే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్ లను చూస్తుంటే నిజంగా అబ్బో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంచుకుంటున్న కథలు, నటన నిజంగా గొప్ప నటులు అని చెప్పాలి. ఈ మధ్య పుష్ప లో అల్లు అర్జున్ ని చూస్తుంటే ఒకప్పుడు అమీర్ ఖాన్ ని చూసినట్టు ఉంది. పెద్ద హీరో అవుతారు. నేను హీరోగా కూడా సినిమాలు చేశాను కానీ ఏ సినిమా నాకు సక్సెస్ రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్, ఇలాంటి పాత్రల్లోనే ప్రేక్షకులు ఆదరించారు. కృష్ణవంశీ ఇచ్చిన పాత్రలు నాకు ఏ రేంజ్ పేరు తెచ్చాయో అందరికి తెలుసు. అలాగే నా రాజా ప్రొడక్షన్ బ్యానర్ పై తీసిన సినిమాలు, సీరియల్స్ కూడా మంచి పేరొచ్చాయి. ముఖ్యంగా నేను చేసిన సీరియల్స్ అన్నింటికీ నంది అవార్డులు వచ్చాయి. 


ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది. ముక్యంగా ఓటిటి బాగా డామినేట్ చేస్తుంది.. ఇంకొన్ని రోజుల్లో థియేటర్స్ చాలా మూతపడతాయి. అది ఎవరు మార్చలేరు. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది కాబట్టి.. మార్పుకు అనుగుణంగా మనం వెళ్లడమే !! ప్రస్తుతం నా సొంత బ్యానర్ లో కళ్ళు సినిమాను రీమేక్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాను మా అబ్బాయితో. వాడేమో నాకు టైం ఇవ్వడం లేదు, ప్రస్తుతం ఓ హిందీ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు మరో మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఇంతవరకు నేను జర్నీ చేసిన ఈ టైం లో నేను ఈ పాత్ర చేయలేదు అన్న ఆలోచన లేదు. నేను భీమవరం నుండి వచ్చినప్పుడు ఎలాగైనా సరే తెరపై కనిపించాలి అన్న ఆలోచనతో వచ్చాను. మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ని నేను. ప్రస్తుతం నేను మూడు సినిమాలు చేశాను.. అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏ బ్యాక్గ్రౌం డ్  లేకండా వచ్చాము కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలని ఉంది.


Share this article :