Home » » Vijay Deverakonda Launched aha Bhamakalapam Trailer

Vijay Deverakonda Launched aha Bhamakalapam Trailer

విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘ఆహా’ థ్రిల్లర్ కామెడీ వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’ ట్రైలర్ విడుదల



మీ సీట్ బెల్ట్స్‌ను గ‌ట్టిగా బిగించాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది. ఎందుకంటే తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ.. ప్ర‌తి తెలుగు వారింటిలో భాగ‌మైన‌ 100% తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో అద్భుత‌మైన ఇంటిని భోజ‌నంలాంటి థ్రిల్ల‌ర్ కామెడీ వెబ్ ఒరిజిన‌ల్ ‘భామా కలాపం’ మన ముందుకు రానుంది. ప్రముఖ నటి ప్రియమణి ఈ వెబ్ ఒరిజినల్ ద్వారా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ ఒరిజిన‌ల్ ఫిబ్ర‌వ‌రి 11న ‘ఆహా’లో ప్రసారమవుతుంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను ‘లైగ‌ర్’ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. 


‘నేను వాస‌న చూసే కూర‌లో ఉప్పు ఎక్కువైందో.. త‌క్కువైందో చెప్పేస్తాను.. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. నేను ప‌సిగ‌ట్టింది త‌ప్ప‌య్యే ఛాన్సే లేదు’ అని అనుపమ (ప్రియమణి) తన స్నేహితురాలితో చెప్పడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. కోల్‌క‌త్తా మ్యూజియంలోని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచిన రూ.200 కోట్ల విలువైన‌ ఓ ఎగ్ (గుడ్డు) మిస్ అవుతుంది. అదెక్కండుందో క‌నిపెట్ట‌డానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వెతుకులాట ప్రారంభిస్తారు. ఆ గుడ్డుకి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే హౌస్ వైఫ్ అనుప‌మ‌కి ఏంటి సంబంధం?  కుటుంబ‌మే లోకంగా ఉండే అనుప‌మ తీరిక ఉన్న‌ప్పుడు డిఫ‌రెంట్ వెరైటీస్ వంట‌ల‌ను వండి వాటిని యూ ట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. అస‌లు అనుప‌మ ఉండే అపార్ట్‌మెంట్‌కి, కోల్‌క‌త్తాల్లో మిస్ ఖ‌రీదైన ఎగ్‌కు లింకేంటో తెలుసుకోవాలంటే ‘ఆహా’ ఫిబ్రవరి 11న ప్రీమియర్ కానున్న వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’ చూడాల్సిందే.


‘భామా కలాపం’లో  ప్రియ‌మ‌ణి అనుప‌మ అనే పాత్రలో.. అన్నీ విష‌యాల‌ను తెలుసుకోవాల‌ని, త‌న‌కు తెలుసు అనే భావ‌న‌తో ఉండే గృహిణిగా క‌నిపిస్తున్నారు. ఈమె అనుప‌మ ఘుమ‌ఘుమ‌లు అనే యూ ట్యూబ్ ఛానెల్‌ను న‌డుపుతుంటారు. జాన్ విజ‌య్‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌, ప‌మ్మీ సాయి, శాంతి రావు త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఎస్‌వీసీసీ డిజిటల్ (అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం మేక‌ర్స్‌)  బ్యాన‌ర్‌పై సుధీర్ ఈద‌ర‌, భోగ‌వ‌ల్లి బాపినీడు ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, ప్రోమో, ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసిన టీజ‌ర్ అన్నీ వెబ్ ఒరిజిన‌ల్‌పై ఆస‌క్తిని పెంచాయి.


‘భామా కలాపం’  ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో 


సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘నేను నలబై ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. అంద‌రూ ఆద‌రించారు. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్‌తో క‌లిసి ఎస్‌వీసీసీ డిజిటల్ మీద చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆద‌రిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు. 


లైగర్ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘భరత్ కమ్మ తన మొదటి సినిమా డియర్ కామ్రేడ్ సినిమా చేశాం. తనతో సినిమా చేయాలని నేనే కోరుకున్నాను.నా కెరీర్లో నేను మరచిపోలేని చిత్రమది. బాపినీడు, ప్రసాద్ గారికి, డైరెక్టర్ అభికి అభినందనలు. ఇక ప్రియ‌మ‌ణిగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె ఏ లాంగ్వేజ్‌లో చేసిన సూట్ అయిపోతారు. ఇప్పుడు ఆమె డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఆమె చేసిన భామా క‌లాపం ఒరిజినల్ ద్వారా. ఇది ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ్ అవుతుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. ఆహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 


ప్రియమణి మాట్లాడుతూ ‘‘భామా కలాపం అనేది నా డిజిటల్ బెస్ట్ డెబ్యూ అని చెప్పాలి. అందుకు భరత్ కమ్మగారికి థాంక్స్. భరత్ కమ్మగారికి, అభిమన్యు తాడి మేటిని చాలా ఇబ్బంది పెట్టాను. అందుకు వారికి థాంక్స్‌. మొద‌టి షెడ్యూల్ కోసం ఆరు రోజులు కేటాయించాను. త‌ర్వాత షెడ్యూల్ కోసం నెల‌న్న‌ర పాటు స‌మ‌యం కేటాయించ లేక‌పోయాను. త‌ర్వాత సింపుల్‌గా, స్వీట్‌గా పూర్తి చేసేలా భ‌ర‌త్‌, అభి వ‌ర్క్ చేశారు. అనుప‌మ వంటి క్యారెక్ట‌ర్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నేను ప్లే చేయ‌లేదు. చాలా అమాయక‌మైన గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తాను. ఫిబ్ర‌వ‌రి 11న భామా క‌లాపం ఆహాలో ప్రసారం కానుంది. ఇంత పెద్ద ఎత్తున దీన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న ఆహా టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 


భరత్ కమ్మ మాట్లాడుతూ ‘‘అభి నాతో 8 ఏళ్లుగా రైటింగ డిపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. లాస్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ ఐడియాను నాకు చెప్పాడు. ఇద్ద‌రం క‌లిసి పాయింట్ మీద వ‌ర్క్ చేశాం. ఆహా టీమ్‌, అర‌వింద్‌గారికి ఈ క‌థ చెప్ప‌గానే వారికి బాగా న‌చ్చేసింది. అయితే అనుప‌మ పాత్ర‌లో ఎవ‌రు చేస్తార‌నే దానిపై అప్పుడింకా నిర్ణ‌యించుకోలేదు. ఆ పాత్ర‌లో న‌టించ‌డానికి ఒప్పుకున్న ప్రియ‌మ‌ణిగారికి  థాంక్స్‌. ఎస్‌వీసీసీ మీద దీన్ని ప్రొడ్యూస్ చేసిన బాపినీడుగారు, సుధీర్ గారికి థాంక్స్‌. అభిమ‌న్య తాడి మేటి దీన్ని అనుకున్న దాని కంటే బాగా డైరెక్ట్ చేశాడు. ఎందుకంటే, అర‌వింద్‌గారు చూడ‌గానే అదే విష‌యాన్ని ఫోన్ చేసి చెప్పారు. యంగ్ టీమ్ ఈ సిరీస్ కోసం ప‌నిచేసింది. దీప‌క్‌, జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌, రాబిన్ అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ అభిమన్యు తాడి మేటి మాట్లాడుతూ ‘‘ఏడాది క్రితం ఏదో క్యాజువ‌ల్‌గా రాసుకున్న క‌థ, ఇక్క‌డి వ‌ర‌కు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. స‌పోర్ట్ చేసిన టీమ్‌కి థాంక్స్‌’’ అన్నారు. 


జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ (రాధే శ్యామ్‌, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల ఫేమ్‌), మార్క్ రాబిన్ సంగీతం సార‌థ్యం వ‌హించిన ఈ ఒరిజిన‌ల్‌కు దీప‌క్ ఎర‌గేర సినిమాటోగ్ర‌ఫీ అందించారు. విప్ల‌వ్ నైష‌ధం ఎడిట‌ర్‌.


అర్జున ఫ‌ల్గుణ‌, హే జూడ్‌, ది అమెరిక‌న్ డ్రీమ్‌, ల‌క్ష్య, సేనాప‌తి, త్రీ రోజెస్‌, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, అనుభ‌వించు రాజా, స‌ర్కార్‌, ఛెఫ్ మంత్ర‌, అల్లుడుగారు, క్రిస్‌మ‌స్ తాత వంటివ‌న్నీ ప్ర‌స్తుతం ఆహాలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న‌వే. శ్రీరామ్‌చంద్ర హోస్ట్ చేస్తున్న ఫ‌స్ట్ ఎవ‌ర్ సౌత్ ఇండియాస్ ఇండియ‌న్ ఐడ‌ల్‌... అదే మ‌న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ త్వ‌ర‌లోనే ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షోను ఐఎండీబీ నెంబ‌ర్ ఒన్ టాక్ షో గా గుర్తించిన విష‌యం తెలిసిందే.



Share this article :