Tremendous Response for Look Trailer

 శింబు ‘లూప్’ కాన్సెప్ట్ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన.. నవంబర్ 25న విడుదల..



తమిళ స్టార్ శింబు (STR) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. మన్మధ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఈయన హీరోగా లూప్ అనే సినిమా వస్తుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. విడుదలైన క్షణం నుంచే లూప్ ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్‌లో సినిమా కాన్సెప్ట్ రివీల్ చేసారు దర్శక నిర్మాతలు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. ఈ చిత్రం కాన్సెప్ట్ అదిరిపోయింది.. వెంకట్ ప్రభు లూప్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సౌత్ సినిమాలలో ఇప్పటి వరకు చూడనటువంటి కథతో ఈ సినిమా వస్తుంది. ట్రైలర్‌లో శింబు తన ట్రేడ్‌మార్క్ యాక్షన్ చూపించాడు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య విలన్‌గా నటించాడు.. సినిమాలో అతడి పాత్ర భయంకరంగా ఉండబోతుంది. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నవంబర్ 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు చిత్ర యూనిట్.

Post a Comment

Previous Post Next Post