Sri Srinkhala Devi productions new film launched

 దర్శకుడు మారుతి క్లాప్ తో  'శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ నూతన  చిత్రం ప్రారంభం



అర్జున్ కళ్యాణ్, వసంతి జంటగా శ్రీ శృంఖలా దేవి ఫిల్మ్స్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.1 మూవీకి శ్రీకారం చుట్టింది. ఈ చిత్ర షూటింగ్  ప్రారంభోత్సవానికి సెన్సేషనల్ డైరెక్టర్ మారుతి అతిథిగా హాజరై..ఫస్ట్ షాట్ కు క్లాప్ నిచ్చారు. కొత్త దర్శకుడు రామరాజు.జి  దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


చిత్ర కథను తెలుసుకొన్న దర్శకుడు మారుతి..స్టోరి చాలా క్రియేటివ్ గా బాగుందంటూ టీమ్ ని అభినందించారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతున్న ఈ మూవీ ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి కానుంది. రోడ్ ట్రిప్ బ్యాక్డ్రాప్ లో జరిగే ఈ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుందని దర్శకుడు రామరాజు.జి. తెలిపారు. కొన్ని రియాలిస్టిక్ సంఘటన ల ఆధారం గా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.


నటీనటులు : అర్జున్ కళ్యాణ్, వసంతి తదితరులు


సాంకేతిక వర్గం : సినిమాటోగ్రఫి - మురళీధర్ సింగు, సంగీతం - మహవీర్ యెలందర్, విజువల్ ఎఫెక్ట్స్ : మహత్రు మీడియా సొల్యూషన్స్, లిరిక్స్ : పూడి శ్రీనివాస్, పీఆర్ ఓ : జి యస్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వీరబాబు .కె, ప్రొడ్యూసర్ : జి. రాధిక, రచన, దర్శకత్వం : రామరాజు.జి..

Post a Comment

Previous Post Next Post