Home » » Sri Devi Soda Center Naa lo Innallu ga Song Released

Sri Devi Soda Center Naa lo Innallu ga Song Released

 'శ్రీదేవి సోడా సెంటర్' నుంచి సిరివెన్నెల రచించిన నాలో ఇన్నాళ్లుగా పాట విడుదల..



సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే మణిశర్మ అందించిన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. తాజాగా ఈ సినిమా నుంచి నాలో ఇన్నాళ్లుగా కనిపించని.. అంటూ సాగే డ్యూయెట్ విడుదల చేసారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి చేర్చింది. దాన్ని దినకర్, రమ్య బెహ్రా అంతే అద్భుతంగా ఆలపించారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.


నటీనటులు:

సుధీర్ బాబు, ఆనంది తదితరులు..


టెక్నికల్ టీం:

దర్శకత్వం: కరుణ కుమార్

నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్ 

సంగీతం: మణిశర్మ

పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Share this article :