రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా గా రాబోతున్న ఫైర్ ఫ్లై ఆర్ట్స్, డార్క్ డ్రామా పిక్చర్స్ వారి చరిత కామాక్షి
ఫైర్ ఫ్లై ఆర్ట్స్, డార్క్ డ్రామా పిక్చర్స్ బ్యానర్లు పై నవీన్ బేతిగంటి, దివ్య దృష్టి సమర్పకులుగా రజనీ రెడ్డి నిర్మాణంలో నూతన దర్శకుడు స్ర్రీ లంక చందు సాయి తెరకెక్కిస్తున్న చిత్రం చరిత కామాక్షి. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సింహా భాగం నూతన తారాగణంతో తెరకెక్కింది. అతి త్వరలో తారాగణం తదితర విషయాలు అధికారికంగా విడుదల అవ్వనున్నాయి. చరిత కామాక్షి అనే టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుందని ప్రకటించడం ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. ప్రస్తుతం చరిత కామాక్షి అనే టైటిల్ లుక్ పోస్టర్ వివిధ సోషల్ మీడియాలో వేదికల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సంపూర్ణంగా ఆకట్టుకునే రీతిన ఈ సినిమాను దర్శకుడు స్త్రీ లంక చందు సాయి తెరకెక్కించారని నిర్మాత రజనీరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల కానున్నాయి
బ్యానర్లు - ఫైర్ ఫ్లై ఆర్ట్స్, డార్క్ డ్రామా పిక్చర్స్
సమర్పణ - నవీన్ బేతిగంటి, దివ్య దృష్టి
నిర్మాత - రజనీ రెడ్డి
దర్శకుడు - స్ట్రీ లంక చందు సాయి
ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస్ - శివ ఎమ్ ఎస్ కే
డిఓపి - రాకీ వనమాలీ
ఎడిటిర్ - కొడటి పవన్ కళ్యాణ్
మ్యూజిక్ డైరెక్టర్ - అబు
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘశ్యామ్
Post a Comment