Manchu Vishnu in MAA President Race



 'మా' అధ్యక్ష పోటీలో మంచు విష్ణు

తెలుగు చిత్రపరిశ్రమలో 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. ఈసారి 'మా' అధ్యక్ష పోటీలో యంగ్ హీరో మంచు విష్ణు బరిలోకి దిగనుండటం ఎన్నికలపై ఆసక్తిని రేపుతోంది. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్కా ప్రణాళికతోనే విష్ణు అడుగులు వేస్తున్నారు.

తండ్రి, డా. మోహన్ బాబు ఆశీస్సులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను, నటీమణులను కూడా విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి సిద్ధమయ్యారు. సీనియర్ నటీనటులు విష్ణు నిర్ణయానికి మద్దతు తెలపడంతో విష్ణు గెలుపుకి ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 'మా' సభ్యుల సంక్షేమం, 'మా' సొంత భవనం ఏర్పాటుకు కృషి... ఇవి  ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు.

Post a Comment

Previous Post Next Post