"శుక్ర" సినిమాలో కొత్తదనం చూస్తారు - దర్శకుడు సుకు పూర్వజ్
మైండ్ గేమ్ నేపథ్యంలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన సినిమా "శుక్ర". సుకు పూర్వజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న శుక్ర సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకు పూర్వజ్ సినిమా విశేషాలు తెలిపారు. దర్శకుడు సుకు పూర్వజ్ మాట్లాడుతూ...
- నేను ఎంబీఏ చేశాను. మూడో తరగతి నుంచే నాకు ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీలో రంగస్థలం అనే నాటికకు బెస్ట్ ప్రైజ్ వచ్చింది. గోల్డ్ మెడల్ తీసుకున్నాను. నాటికలు, నాటకాలు ప్రదర్శించేవాళ్లం. నా పేరు సురేష్ కుమార్. కొత్తగా ఉంటుందని సుకు పూర్వజ్ అని పెట్టుకున్నా. పూర్వజ్ అనేది ఒక మహర్షి పేరు.
- శుక్ర అనే పేరుకు సబ్జెక్ట్ కు లింక్ ఉంది. ఆపరేషన్ శుక్ర అనేది సినిమాలో జరుగుతుంది. మైండ్ గేమ్ అనే జానర్ లో సినిమా సాగుతుంది. ఇండియాలో కొన్ని నగరాలను వణికిస్తున్న ఒక మాఫియా గ్యాంగ్ ఇతివృత్తంగా సినిమా ఉంటుంది. ఒక కపుల్ మాఫియా ప్రభావిత నగరంలో అడుగుపెడతారు. అక్కడ ఆపరేషన్ శుక్ర మొదలువుతుంది.
- 10 పైలెట్, ఇండిపెండెంట్ ఫిలింస్ చేశాను. అందులో కాలజ్ఢానం అనే దానికి న్యూయార్క్, ముంబై ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డ్స్ వచ్చాయి. నేను సాఫ్ట్ వేర్ జాబ్ చేశాను కొన్నాళ్లు. నా మనసుకు నచ్చింది ఇది కాదు అనిపించింది. సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాను. అక్కడి నుంచి స్క్రిప్ట్ లు రాశాను.
- నా దగ్గర పెద్ద లైబ్రరీ ఉంది. అనేక స్క్రిప్ట్ లు బౌండ్ గా చేసి పెట్టాను. కొన్ని స్క్రిప్టులు నావి బయటకొచ్చాయి. ఆ సినిమాలు బాగా ఆడాయి కూడా. కోటిన్నర రూపాయల బడ్జెట్ లో ఓ కథ తయారు చేసి ఒక నిర్మాతకు చెప్పాను. ఆయన నా దగ్గర ఇంతే ఉందని కొంత అమౌంట్ చెప్పారు. అందులోనే సినిమా చేద్దామని దిగాము. అందుకే బడ్జెట్ ప్రకారం ఒక బిల్డింగ్ లో కథ మొత్తం ఉండేలా రాసుకున్నాం. ఇంతలో మా నాన్నగారు కేన్సర్ తో చనిపోయారు. ఇటు సినిమా ఓకే అవడం, అటు నాన్నగారు చనిపోవడం రెండూ ఒకేసారి జరిగాయి. ఆ కష్టాలు భరించి సినిమాను ప్రారంభించాం.
- అరవింద్ కృష్ణ గారితో నాలుగేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాను. ఆయన డిక్షన్, బేస్ వేరుగా ఉంటుంది. నేను ఏ కథ రాసినా అందులోకి ఆయన తెలియకుండా వచ్చేవారు. నాకు ఎప్పుడూ కలిసినా కొత్త మనిషిని కలిసినట్లే ఉండేది. ఈ సినిమా కోసం ఆయన పైసా కూడా తీసుకోలేదు. కష్టపడి ఏడాదిన్నర సినిమాతో ట్రావెల్ అయ్యారు. ఒక సినిమాకు ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం. కానీ ఆ కష్టం సినిమా మీద ప్రభావం చూపించలేదు. సినిమా అందంగా వచ్చింది.
- యాక్షన్, క్రైమ్ జానర్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఏ సినిమాకు ఆ సినిమా ఏదో విధంగా భిన్నంగా ఉంటుంది. అలా శుక్ర చిత్రం కూడా ఓ వైవిధ్యం ఉంటుంది. ఓటీటీ లో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చాలా వస్తున్నాయి. వాటిని మరిపించే కొత్త కంటెంట్ శుక్రలో చూస్తారు. సినిమా చూశాక...సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో వీళ్లను ఒకసారి కలవాలి అనుకుంటారు.
- శుక్ర సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉండవు. ఏదీ ఆశించకుండా వచ్చిన వాళ్లు సంతృప్తి చెందుతారు. ట్రైలర్, సాంగ్స్ చూసిన వాళ్లకు ఒకసారి సినిమాకు వెళ్దాం అనిపిస్తుంది. ఒకే బిల్డింగ్ లో సినిమా అయినా కథనం గ్రిప్పింగ్ గా ఉంటుంది. ట్రాక్ సినిమాలో ఉంటే అదే ట్రాక్ లో ముందుకు వెళ్లాలి. అది వదిలి మరోటో చేస్తే మన ఆడియెన్స్ డీవీయేట్ అవుతారు. మన ఆడియెన్స్ చాలా మెచ్యూర్ అయ్యారు ఇప్పుడు. ఇలాంటి టైమ్ లో సెపరేట్ ట్రాక్ లు పెట్టడం కరెక్ట్ కాదు.
- రాస్తున్నప్పుడు మాత్రమే నేను అనే వాడిని ఉంటాను. ప్రొజెక్షన్ దగ్గరకు వచ్చేప్పుడు వివిధ రకాల ప్రభావాలు పడుతుంటాయి. ఓ పాటలో ఫ్రూట్స్ పెట్టాలి అనుకుంటే రాఘవేంద్రరావు గారు గుర్తొస్తారు. అలా ఎమోషన్ రావాలంటే రాజమౌళి గారు గుర్తొస్తారు. నేను యాక్టింగ్ సైడ్ ఉండేవాడిని. అప్పుడు జానీ సినిమా రీలీజ్ అయ్యింది. ఆ సినిమా చూసి దర్శకుడిని కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ సినిమాలో గోల్కొండ ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఆ సీన్ సినిమాలో తర్వతా తీసేశారు.
- శుక్ర ప్రివ్యూ షోస్ చూసిన వాళ్లు సినిమా బాగుందని చెప్పారు. ఇప్పుడు ఆడియెన్స్ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం. మాకు సినిమా ఎంత నచ్చినా ఆడియెన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడే నిజమైన సంతృప్తి దక్కుతుంది.
Post a Comment