Top News

Senior Journalist Ram Mohan Naidu Thanked Megastar Chiranjeevi

 


చిరంజీవి గారు తీసుకున్న కేర్ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను: సీనియర్ జర్నలిస్ట్ రామ్ మోహన్ నాయుడు.

తీవ్ర అనారోగ్యంతో గత 4 నెలల నుండి చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రామ్మోహన్ నాయుడుని మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు పరామర్శించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా, స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకోవడమే కాకుండా ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేశారు చిరంజీవి గారు.

ఆయన ఆరోగ్యం కుదుటపడి కోలుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ రోజు రామ్మోహన్ నాయుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు. చిరంజీవి గారిని కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు రామ్మోహన్ నాయుడు.

 ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ...

నేను ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నాను. గత నాలుగు నెలల నుండి నాకు ఆరోగ్యం బాగాలేదు. కరీంనగర్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. మొదట జాండిస్ అన్నారు...కానీ ఆ ట్రీట్మెంట్ లో చాలా వీక్ అయ్యాను, మనుషులను కూడా గుర్తుపట్టలేదు. ఇడ్లీ లో సగంకుడా తినలేని పరిస్తితికి వెళ్ళాను. మొత్తానికి అక్కడనుండి హైదరాబాద్ వచ్చాను, నా అనారోగ్యం గురించి చిరంజీవి గారు తెలుసుకుని నన్ను ఇంటి నుంచి   ఆసుపత్రిలో చేర్పించారు.

నిజంగా ఇది నాకు పునర్జన్మ లాంటిది. చిరంజీవిగారు నా అనారోగ్యం గురించి తెలుసుకుని, ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి పరామర్శించారు. అక్కడి వైద్యలు, చిరంజీవి గారి వల్లనేను పూర్తిగా కొలుకున్నాను. చిరంజీవి గారు లేకుంటే నా పరిస్తితి ఏమై పోయేదో. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ కు నా జన్మంతా రుణపడి ఉంటాను, అలాగే స్వామి నాయుడు, మెగా ఫ్యాన్స్ కు కూడా నా ధన్యవాదాలు అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి గారు కూడా ఆయన ఆరోగ్య విషయాలను అడిగి మరి తెలుసుకున్నారు" అన్నారు.

Post a Comment

Previous Post Next Post