రివ్యూ: ఉయ్యాలా జంపాలా
రేటింగ్: 3.5/5
బ్యానర్: సన్‌షైన్ సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్
తారాగణం: రాజ్ తరుణ్, అవిక, రవివర్మ,అనితా చౌదరి, కిరీటి ,పునర్నవి, తదితరులు
కథనం: విరించి వర్మ, రాజ్ తరుణ్,రామ్ మోహన్
సంగీతం: ఎం.ఆర్. సన్నీ
కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాతలు: పి. రామ్ మోహన్,అక్కినేని నాగార్జున
కథ, దర్శకత్వం: విరించి వర్మ
విడుదల తేదీ: డిసెంబర్ 25, 2013
అచ్చమైన తెలుగు సినిమా లు అరుదు గా వస్తాయి చక్కటి పల్లెటూరు కుటుంబ నపధ్యం లో సినిమాలు ఎప్పుడో కానీ రావు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తరవాత చక్కటి కుటుంబ విలువలు ఆ ప్రేమలు బావ మరదలు మధ్య అనుభందం వంటి విషయాలతో వచ్చిన మరో సినిమా ఈ ఉయ్యాలా జంపాలా ఈ సినిమా హైలైట్ ఏంటి అంటే తెలుగు పరిశ్రమ లో వున్నా పెద్ద హీరో పెద్ద నిర్మాత బాగస్వామ్యం అవ్వడం నాగార్జున సురేష్ బాబు కలయిక ఈ సినిమాని మరో మెట్టు ఎక్కించింది . ఫస్ట్ లుక్ తోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా క్రమం గా మంచి క్రేజ్ సంపాదించుకోంది రాజ్ తరుణ్, అవిక లు చేసిన ఈ ఉయ్యాలా జంపాలా ఎలా వుందో తెలియాలి అంటే ఈ రివ్యూ చదవలసిందే
ఇది కధ: ఇది చెప్పడానికి చాల చిన్న కధ అయిన చెప్తాను . ఇది కూనవరం అనే పల్లెటురు లో ఒక బావ మరదలు మధ్య జరిగే కధ . బావ సూరి(రాజ్ తరుణ్) మరదలు ఉమా దేవి (అవిక) మన వాడు కూనవరం కింగ్ లా ఫీల్ అవుతూ వుంటాడు. మరదలిని ఏడిపిస్తూ గొడవపడుతూ చేపల చెరువులు ఉన్నవారికి కోడి పెంట ఎరువు లు అమ్ముతూ జీవనం సాగిస్తువుంటాడు .ఇంతలో ఉమాదేవి పార్ధు అనే వ్యక్తి ప్రేమలో పడుతుంది కానీ మోసపోతుంది . ఇంతకీ ఆమెకి జరిగిన మోసమేంటి ? ఆమె తన బావ ని మళ్ళీ ఎలా ప్రేమిస్తుంది . బావ మరదలు ఉమా దేవి ని పెళ్లి చేసుకున్నాడ ? ఉమా దేవి తండ్రి అందుకు ఒప్పుకున్నాడ ?వీళ్ళ ప్రేమ కధ లో ట్విస్ట్ లు ఉన్నాయా? వుంటే ఏంటి ఆ ట్విస్ట్లు తెలుసుకోవాలి అంటే మీరు సినిమా వెండి తెర మీద చూడాలి
నటీనటుల పని తీరు
ఈ సినిమా లో ముఖ్యం గా చెప్పుకోవస్సింది సూరి ( రాజ్ తరుణ్) గురించి మొదటి సినిమా అయిన చాల బాగా చేసాడు నటుడిగా మంచి ఫ్యూచర్ వుంటుంది అని చెప్పక తప్పదు .సూరి క్యారెక్టర్‌కి కరెక్ట్ గా సూట్ అయ్యాడు నూటికి నూరు శాతం న్యాయం చేసాడు ముఖ్యం గా డైలాగ్ డెలివరీ చాల బాగుంది గోదావరి యాస లో చెప్పిన డైలాగ్ లు చాల బాగున్నాయి పాత్రలో లీనమయిపోయి నటించాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు .
అవిక (ఉమా దేవి ) విషయానికి వస్తే చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో ఆమె చాల మందికి పరిచయం ఆ సీరియల్ లో కంటే చాల బాగా నటించింది ఆమె వయసుకు తగ్గ పాత్ర ఇది పల్లెటురి అమ్మాయి పాత్రలో ఒదిగి పోయింది తన పాత్రకి ఆమె బాగా సూట్ అయింది పాటలలో కూడా బాగా అందం గా కనిపించడం తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా చాల బాగా నటించింది
సుబ్బారావు పాత్ర తో సెకండ్ హ్యాండ్ సినిమా లో అలరించిన కిరీటి దామరాజు ఈ సినిమా లో కూడా
చిన్న పాత్ర చేసాడు ఆ పాత్ర కి న్యాయం చేసాడు
సెకండ్ హీరొయిన్ టైపు క్యారెక్టర్ చేసిన పునర్నవి కూడా తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది
అనిత చౌదరి రాజ్ తరుణ్ తల్లి పాత్రలో కలిన్పిస్తారు రవివర్మ (అవిక ఉమాదేవి) తండ్రి పాత్రలో నటించారు ఇద్దరు వారి పాత్రకు 100శాతం న్యాయం చేసారు అని చెప్పాలి
ప్లస్ పాయింట్స్
రాజ్ తరుణ్ ,అవిక ,నటన
డైలాగ్ లు
కధ
రిచ్ నెస్
సినిమా ని అందం గా తెరకెక్కించడం
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ స్లో గా వుండడం
క్లైమాక్స్ అంత ఎఫెక్టివ్ గా ఉండక పోవడం
సాంకేతిక వర్గం పనితీరు
చిన్న సినిమా అయిన ఆ ఫీలింగ్ రాకుండా సాంకేతిక నిపుణులు ఈ సినిమా కి మంచి శ్రద్ద తేసుకున్నారు
ముఖ్యం గా కోనసీమ లోని పల్లె టూరు అందాలను చాలా బాగా చూపించడం లో సినిమాటోగ్రాఫర్ విశ్వ సక్సెస్ అయ్యారు
ఎం.ఆర్. సన్నీ ఇచ్చిన సంగీతం పరవాలేదు
మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది
ఈ విభాగం లో ముఖ్యం గా మేచ్చుకోవలసింది దర్శకుడు విరించి వర్మ ని తను అనుకున్నది చక్కగా చూపించడం లో సక్సెస్ అయ్యాడు మంచి మార్కులు కొట్టేసాడు
తీర్పు
ఈ మధ్య వస్తున్నకొన్ని బూతు సినిమా ల వల్ల చిన్న సినిమా అంటే బూతు సినిమా నే అనుకునే స్థాయికి వెళ్లి పోయారు జనాలు . కానీ చిన్న సినిమా లలో మంచి సినిమా లు కూడా వుంటాయి అని ఈ ఉయ్యాలా జంపాల నిరూపించింది . ఫస్ట్ హాఫ్ చాల హ్యాపీ గా గోదావరి లో ప్రయాణం లా సాగిపోతుంది మన పల్లె టురికి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది . ఇది నిజంగా జరుగుతోందా అని పిస్తుంది సినిమా అనే ఫీలింగ్ కూడా రాలేదు కానీ సెకండ్ హాఫ్ కొంచం నిరాశ పరిచాడు క్లైమాక్స్ కొంచం నీట్ గా ప్లాన్ చేసి వుంటే బాగుండేది ఇది చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమా చూస్తే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి
రివ్యూ -సందీప్
Follow us in Face book
https://twitter.com/MATELUGUCINEMA
Post a Comment