చిత్రం – సెకండ్ హ్యాండ్
నటీనటులు – సుధీర్ వర్మ, కిరీటి, శ్రీ విష్ణు ధన్య బాలకృష్ణ అనూజ్, పోసాని
ఎడిటింగ్– ఎస్.ఆర్.శేఖర్
నిర్మాత – ఎస్.పూర్ణా నాయుడు
సహనిర్మాత – బివిఎస్ రవి
రచన, దర్శకత్వం – కిషోర్ తిరుమల
సంగీతం రవిచంద్ర
విడుదల తేది – 13-13-14
Telugucinemas.in Rating-3/5
అమ్మాయిల ప్రేమ కి అబ్బాయిల ప్రేమ కి తేడ ఏంటి ఆ ప్రేమ ని నిలబెట్టు కోవడానికి ఎన్ని కష్టాలు పడాలి ప్రస్తుతం నడుస్తున్న ప్రేమలు ఆధారం గా వచ్చిన సినిమా ఈ సెకండ్ హ్యాండ్ . ఇది మూడు జంటల ప్రేమ కధ
సంతోష్ (సుధీర్ వర్మ) -దీపు (ధన్య బాలకృష్ణ)
సుబ్బారావ్ ( కిరీటి ) -స్వేఛ్చ ( ధన్య బాలకృష్ణ )
సహస్ర (ధన్య బాలకృష్ణ)-చైతు (శ్రీ విష్ణు)
ఈ మూడు జంటల ప్రేమ ఎలా సాగింది సెకండ్ హ్యాండ్ అని పెట్టడానికి కారణం ఏంటి
అన్నది మీరు స్క్రీన్ మీద చూడాలి
నటి నటుల పని తీరు
ఈ సినిమా మెయిన్ హై లైట్ ధన్య బాలకృష్ణ కిరీటి కనబరిచిన నటన ముఖ్యం గా ధన్య బాలకృష్ణ తను నటించిన మూడు వైవిధ్యమైన పాత్రలకు న్యాయం చేసింది . కిరీటి చాల సార్లు నవ్వించారు సుబ్బారావు పాత్రకి కరెక్ట్ గా సెట్ అయ్యారు . నేను సైలెంట్ గా ఉంటేనే సుబ్బారావు ని నాకు మంట ఎక్కిస్తే సునామిని వంటి డైలాగ్ లతో ప్రేక్షకులని అలరించారు
శ్రీ విష్ణు సుధీర్ వర్మ,అనూజ్ రామ్ వారి పాత్ర పరిధిలో చక్కగా నటించారు
పోసాని తన పేరు చెప్పక పోయిన మంచి మెసేజ్ ఇచ్చారు
శరవణన్ పాత్రలో దర్శకుడు కిషోర్ నటించారు తన కామెడీ తో ప్రేక్షకుడిని కాసేపు నవ్వించారు
ప్లస్ పాయింట్స్
ధన్య బాలకృష్ణ నటన
కీరిటి దామరాజు కామెడీ సూపర్.
సుబ్బారావు పాత్ర బాగా ప్లస్ అయ్యింది
ఫస్ట్ హాఫ్ లోని ఎంటర్ టైన్మెంట్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ కొంచం స్లో గా వుండడం
యూత్ కి నచ్చేలా తీసారు కానీ ఫామిలీ ఆడియన్స్ కి సినిమా నచ్చుతుంది అని చెప్పలేం
ఒకే హీరొయిన్ తో మూడు పాత్రలు చేయించారు అది కొంచం అర్ధం చేసుకోవడానికి టైం పడుతుంది
సాంకేతిక నిపుణుల పని తీరు
డైరెక్టర్ కిషోర్ తిరుమల వర్క్ బాగుంది ప్రేక్షకుల నాడి పట్టుకోవడం లో sucess అయ్యాడు సెకండ్ హాఫ్ మీద కొంచం శ్రద్ధ పెట్టి వుంటే బాగుండేది అక్కడ అక్కడ సాగదిసాడు అనే ఫీలింగ్ వచ్చింది
ఎస్.ఆర్.శేఖర్ ఎడిటింగ్ బాగానే వుంది
రవిచంద్ర మ్యూజిక్ బాగుంది కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత బాగోలేదు
నిర్మాత వున్న బడ్జెట్ లో రిచ్ గా తీసారు అందుకు ఎస్.పూర్ణా నాయుడు బివిఎస్ రవి లను అభినందించాలి
తీర్పు
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కలిపి ఓవరాల్ గా బాగుంది కానీ ఇది కేవలం యూత్ కి నచ్చే సినిమా మనం చూసే నేటి ప్రేమలకు సంబందించిన సినిమా ఎక్కువ ఆశపడి నిరాశ చెందకండి నార్మల్ గా సినిమా కి వెళ్తే నచ్చు తుంది
రేటింగ్ -3/5
రివ్యూ -సందీప్
Contact us at Telugucinemas.in@gmail.com https://www.facebook.com/MATELUGUCINEMA www.twitter.com/Matelugucinema
Post a Comment