చిత్రం – బిరియాని
నటీనటులు – కార్తి, హన్సిక, ప్రేమ్ జీ, నాజర్, సంపత్,రాంకీ, మ్యాడీ థాకర్ మధుమతి తదితరులు
సంగీతం – యువన్ శంకర్ రాజా
ఎడిటింగ్ – ప్రవీన్.కె.ఎల్, ఎన్.బి.శ్రీకాంత్
సినిమాటోగ్రఫీ – శక్తి శరవణన్
నిర్మాణం – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె.ఇ.జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం- వెంకట్ ప్రభు
విడుదల తేది – 20-12-13
ఆవారా, నాపేరు శివ, యుగానికి ఒక్కడు సినిమా ల తో తెలుగు లో వరసగా మంచి హిట్లు కొట్టిన కార్తి తరవాత ఫ్లాప్ లు ఇవ్వడం స్టార్ట్ చేసాడు శకుని, బ్యాడ్ బాయ్ ఆ కోవకే చెందుతాయి ఇప్పుడు మరో సారి బిరియాని సినిమా తో తెలుగు ప్రేక్షకులకు విందు భోజనం పెట్టడానికి వచ్చాడు ఇంతకి ఈ బిర్యానీ రుచి గా వుందో లేదో తెలియాలి అంటే మా రివ్యూ ని చదివి తీరాలి
కధ
మందు కొడితే మెయిన్ డిష్ గా బిర్యానీ ని తినడం ఈ సినిమా హీరో సుదీర్ (కార్తి) కి అలవాటు అలాగే ఒకరోజు వాళ్ళ బాస్ ఇచ్చిన పార్టీ తరవాత బిర్యానీ తినడం కోసం ఊరంతా తిరుగుతాడు ఎట్టకేలకి బిర్యానీ తింటాడు ఇక్కడ కధ మొదలవుతుంది సమస్యల వలయం లో చిక్కుకుంటాడు సుదీర్ . ఇంతకి ఏంటి ఆ సమస్య ఎలా బయట పడ్డాడు అన్నది మిగిలిన కధ
నటీనటుల పని తీరు
కార్తి తన మార్క్ నటన తో ప్రేక్షకులను అలరించాడు
హన్సిక కి తక్కువ సీన్స్ వుంటాయి వున్నా కాసేపు పరవాలేదు అని పించింది డాన్సు కూడా ఓకే ఓకే
ఈ సినిమా లో పరసు రోల్ చేసిన ప్రేమ్ జీ మంచి మార్కులు కొట్టేసాడు
ఈ సినిమా లో మాయ రోల్ చేసిన మండి థాకర్ తన అంద చందాలతో అలరిస్తుంది నటన కూడా బాగానే చేసింది
నాజర్ వరద రాజులూ పాత్రకి సరిగ్గా సరిపోయారు
ప్లస్ అండ్ మైనస్
ఈ సినిమా కి ప్లస్ లు కన్నా మైనస్ లు ఎక్కువ గా వున్నాయి
కార్తి తన నటన తో చాల వరకు మెప్పించారు
కార్తి ప్రేమ్ జీ ల కాంబినేషన్ సీన్స్ బాగా నవ్విస్తాయి
కార్లు ఫారిన్ కార్లు సీన్ చాల నవ్విస్తుంది
మాయ రోల్ మాస్ ని అలరిస్తుంది
ఇక మైనస్ పాయింట్స్
స్టొరీ లో పట్టు లేకపోవడం
చాల వరకు సీన్స్ ఎందుకు పెట్టారో తెలియదు ప్రేక్షకుడు ఏదో వుహించు కుంటాడు అక్కడ ఏదో కనపడుతుంది మహాత్ ,వైభవ్ లాంటి వారితో ఫ్లాష్ మొబ్ సీన్ వుంటుంది అది ఎందుకో ఎవరికీ తెలియదు వరదరాజులు స్కాం అది ఇది అని సిబిఐ ఆఫీసర్ వస్తాడు కానీ క్లైమాక్స్ లో స్కాం చేసిన వారిని అర్రెస్ట్ చేసాం అని చూపిస్తారు
కార్తి క్లైమాక్స్ ఫైట్ లో ఒక పోలీస్ ఆఫీసర్ తో ఫైట్ లో అద్దం బదల కొట్టేసుకుని బయటకి దూకుతాడు అంతే సినిమా అయిపోతుంది
ముగింపు సరిగా లేదు
చాలా చోట్ల లాజిక్ మిస్ అవుతారు
సాంగ్స్ కూడా పెద్ద గొప్పగా లేవు
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏదో అనుకుని ఏదో చేసినట్టు వుంటుంది సినిమా
తీర్పు
రుచించని బిర్యానీ . తయారీ పదార్దాలు సరిగా పడలేదు మీరు ఆబ గా వెళ్తే నిరాశ పడతారు ఏదో వెరైటీ వచ్చింది ట్రై చేద్దాం అని వెళ్తే ఓ మోస్తరి గా ఎంజాయ్ చేస్తారు ఒక సారి రుచి చూడొచ్చు
Telugucinems .in రేటింగ్ 2. 75/5
రివ్యూ సందీప్
Contact us at Telugucinemas.in@gmail.com https://www.facebook.com/MATELUGUCINEMA www.twitter.com/Matelugucinema
Post a Comment