‘ప్రేమ కథా చిత్రమ్’ తో తోలి హిట్ అందుకున్న సుధీర్ బాబు ఇప్పుడు ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ చిత్రం ద్వారా కృష్టారెడ్డి గంగదాసు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా కి ఇద్దరు నిర్మాతలు ఎం. సుబ్బారెడ్డి – ఎస్.ఎన్ రెడ్డి సంగీతం శ్రీ కొమ్మినేని అందించారు అస్మిత సూద్ సుదీర్ బాబు సరసన నటించారు అజయ్ ప్రతి నాయకుడు పాత్ర పోషించారు ఇక ఈ సినిమా ఎలా వుందో చూడడం
కథ : చాల రొటీన్ అసలు కధ ఏంటో అర్ధం కాలేదు కిక్ సినిమా లో రవితేజ కి తండ్రి బయపడి నట్టు ఈ సినిమా లో సిద్దు (సుదీర్ బాబు ) ని చూసి ప్రసాద్ (నరేష్) బయపడుతువుంటాడు ప్రతి సినిమా లో లాగే ఈ సినిమా లో కూడా హీరో మొదటి చూపులోనే హీరొయిన్ ఇందూ(అస్మితా సూద్ ) ప్రేమ లో పడిపోతాడు ఆమె కోసం ఆమె చదువుతున్న కాలేజీ లో చేరతాడు అదే కాలేజీ లో ఇందు వాళ్ళ అన్నయ్య చెర్రి(రణధీర్) కూడా చదువుతాడు ఆమె ఫై ఎవరు కనేత్తి చూడకుండా చూస్తాడు ? అదే కాలేజీ లో చేరిన సిద్దు ఆమె ను ప్రేమించాడ లేదా ? ప్రేమిస్తే వాళ్ళ ప్రేమకి చెర్రి ఒప్పుకున్నాడ ?అంజలి(పూనం కౌర్) చెర్రి ప్రేమలో ఎలా పడింది వాళ్ళ ప్రేమకి బుజ్జి (అజయ్) ఒప్పుకున్నాడ తను పెళ్లి చేసుకోవలసిన అంజలి చెర్రీ ప్రేమలో పడితే ఊరుకున్నాడ
అన్నంది స్టొరీ
ప్లస్ అండ్ మైనస్
ఈ సినిమా కోసం సుదీర్ బాబు 6 ప్యాక్ చేసారు అది కేవలం ఒక పాటకే పరిమితం అయ్యింది నటన పరం గా సుదీర్ బాబు చాల బాగా చేసాడు కానీ వాయిస్ బాగోలేదు అయన వాయిస్ ఫై కొంచం శ్రద్ద పెట్టాలి . ఫైట్ లు డాన్సు లు బాగా చేసారు
ఈ సినిమా లో మెయిన్ హై లైట్ ఒక కుక్క సినిమా మొత్తం లో ఆ కుక్క కనిపించిన ప్రతి సారి కడుపు చెక్కలయ్యేలా నవ్వుతారు ప్రేక్షకులు సినిమా సాగా దిస్తున్నాడు అన్న ఫీలింగ్ వచినప్పుడు ఆ కుక్క ప్రేక్షకుడిని సేవ్ చేస్తుంది
ఈ సినిమా లో కుక్క చాల మంచి డైలాగ్ లు చెపుతుంది ఒక సాంపిల్ డైలాగ్ మీకోసం
సంసారం కోసం సముద్ర స్ననానికి వెళితే ఉప్పు నీరు తగిలి వున్నంది వుడింది ట అల వుంది ఇప్పుడు నా పరిస్థితి అని కుక్క చెప్పిన డైలాగ్ బాగా పండించి ఇలాంటివి చాల చెప్పింది కుక్క
ఇందూ పాత్రలో అస్మితా సూద్ కనిపించింది కానీ ఆ క్యారెక్టర్ పెద్ద గొప్ప గా లేదు సో సో అనిపించింది
అంజలీ పాత్రలో పూనమ్ కౌర్ కనిపించింది చాల చిన్న పాత్ర కానీ పరవాలేదు అనిపించింది
ప్రతినాయకుడు గా చేసిన అజయ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు
సుమన్ చేసిన పాత్ర చిన్నదే కానీ న్యాయం చేసాడు
నరేష్ కామెడీ బాగుంది
రణధీర్ పృథ్వీ, కృష్ణభగవాన్ బాగానే చేసారు
మెయిన్ మైనస్ డైరెక్టర్ అసలు కధ ను చెప్పే విధానం లో ఫెయిల్ అయ్యాడు అనవసరం గా సాగాతియడం వల్ల ప్రేక్షకుకి బోర్ కొడుతుంది
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి బాగా రిచ్ గా తీసారు
సినిమాటోగ్రాఫర్ సాంటానియో టెర్జియో పని తీరు బాగుంది సినిమా ని చాల అందం గా చూపించాడు
మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే
తీర్పు : సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ చాల బోర్ గా వుంది
తెలుగు సినిమాస్ . ఇన్ రేటింగ్ 2. 5/5
రివ్యూ -సందీప్
Post a Comment