Varna Review -Anushka Arya Varna Movie Review Ratings





'వర్ణ'


విడుదల తేదీ : 22 నవంబర్ 2013

 కథ, కథనం, దర్శకత్వం : శ్రీ రాఘవ
నిర్మాత : పొట్లూరి వి ప్రసాద్ 


సంగీతం : హారీష్ జైరాజ్

నటీనటులు : ఆర్య, అనుష్క
  
 తెలుగుసినిమాస్ .ఇన్ రేటింగ్ : 2/5  

  
 తమిళంలో రూపొందిన 'ఇరందామ్ ఉల్గమ్' చిత్రం తెలుగులో 'వర్ణ'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క   ఆర్య జంటగా శ్రీరాఘవ దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ పై పొట్లూరి వి ప్రసాద్ వర్ణ చిత్రాన్ని 60 కోట్ల వ్యయంతోనిర్మించారు భారీ అంచనాలతో 1200 స్క్రీన్స్ లో విడుదలైంది  ఇక ఈ సినిమా కధ ఇలా వుంది 

కధ :
ప్రేమ మనిషిని ఎంత వరకైనా తీసుకెళ్తుంది ప్రేమించిన వారిని చేరుకోవడానికి లోకలతో పని లేదు ఇది మెయిన్ పాయింట్ ఈ కధ  
రెండు జంటల ప్రేమకథ   రెండు లోకాల్లో రెండు జంటల మధ్య నడిచిన ప్రేమ    ఈ రెండు లోకాల ప్రేమను డైరెక్టర్ రాఘవ ఒక సీన్ ఈ లోకం  ఇంకో సీన్ లో భూమికి కొన్ని వేల కిలోమీటర్ ల దూరం వుండే గ్రహం లో జరిగే విషయాలను చూపిస్తారు భూలోకం లో మధు బాల కృష్ణ రమ్య ల మధ్య ప్రయాణం ,ఎలా కలిసారు, వాళ్ళ మధ్య ఎం జరిగింది? రమ్య ఎలా చనిపోయింది  ?మరో గ్రహం లో వర్ణ ఎందుకు ఆత్మ హత్యా కు ప్రయత్నిస్తుంది ?వర్ణ ఆ గ్రహం  లో ఎవరిని ప్రేమించింది? రెండు గ్రహాల మధ్య సంబంధం ఏంటి? ఇవ్వన్ని తెలుసుకోవాలి అంటే సినిమా చూడాలి  

 మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్ 


ప్లస్ :సినిమా కధ ఎలా వున్నా చూసేవాడికి మంచి మంచి లొకేషన్స్ చాల గ్రాండ్ గ కనిపించే లుక్ ఆ లుక్ కోసం ప్రొడ్యూసర్ పెట్టిన కర్చు మెయిన్ హై లైట్  క్రియేటివ్ గ్రాఫిక్స్ చాల బాగున్నాయి  
అనుష్క నటన మెయిన్ ప్లస్ ముఖ్యం గ వర్ణ పాత్రలో అనుష్క నటన అభినందనీయం 
హరీష్ జై రాజ్ సాంగ్స్ అండ్ అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండు బాగున్నాయి 
మైనస్ : అబ్బో చాల వున్నాయి ముఖ్యం గా  ఒక సీన్ లో ఈ లోకం వెంటనే వేరే సీన్ లో వేరే లోకం ఇలా రెండు గ్రహాల సన్నివేశాలను ఒకదాని తరవాత మరొకటి చూపించడం తో చాల ఇబ్బందిగా  గజిబిజి గ వుంటుంది సినిమా స్క్రీన్ ప్లే బాగోలేదు  
దాదాపు 2గ45ని వుంటుంది సినిమా బాగా సాగదిసినట్టు అనిపిస్తుంది 
కొన్ని చోట్ల  సెల్వ రాఘవన్ 7/జి బృందావన్ కాలనీ సినిమా గుర్తుకు వస్తుంది 
డైలాగ్స్ కూడా కొత్త గా లేకపోవడం తెలుగు మీద పట్టు లేని వారు రాసినట్టు వుంటాయి 
కొత్తగా ప్రజెంట్ చేద్దామనే శ్రీరాఘవ ప్రయత్నం ఫలించలేదు 

సాంకేతిక విభాగం :
సాంకేతికం గా ఈ సినిమా కి పేరు పెట్టవలసిన పని లేదు కర్చుకు  వెనకాడకుండా పొట్లూరి వి ప్రసాద్  ఈ సినిమా ని నిర్మించారు 
అయన పెట్టిన కర్చు అంత స్క్రీన్ మీద కనిపిస్తోంది కానీ  ఆ కర్చుకి 

శ్రీ రాఘవ తగిన న్యాయం చెయ్యలేదు అని నా భావన కధ ని 


వివరించడంలో శ్రీ రాఘవ ఫెయిల్ అయ్యారు అని చెప్పక తప్పదు 


హరీస్ జైరాజ్ సంగీతం. చంద్ర బోస్ లిరిక్స్ బాగున్నాయి రాంజీ కెమెరా పనితనం  అధ్బుతం ఈ సినిమా కి ఎడిటర్ కత్తెర సరిగా తెగలేదు అనుకుంట  కొన్ని అనవసరపు  సీన్స్ తొలగించి వుంటే ఈ సినిమా అంత బోర్ కొట్టేది కాదు 

తీర్పు : కొన్ని సీన్స్ బాగున్నాయి చాల సీన్స్ బోర్ గా వున్నాయి   

Post a Comment

Previous Post Next Post