Satya -2 -One Time Watch Movie-Telugucinemas.in

   

‘సత్య 2′ 
నటీనటులు :శర్వానంద్, అనైక సోతి, అర్చన గుప్త.
దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ
 నిర్మాత : సమంత్ కుమార్ రెడ్డి 
సంగీతం : అమర్ మొహిలే, కారి అరోరా
విడుదల తేదీ : 08 నవంబర్ 2013
 తెలుగుసినిమాస్ .ఇన్ రేటింగ్ : 3/5 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని సంవత్సరాల  క్రితం దర్సకత్వం వహించి విజయం సాదించిన సత్య  పేరుతో ఇప్పుడు మరో సినిమా ని ప్రేక్షకుల ముందు కి తెచ్చారు  అదే ‘సత్య 2′  
క్రైమ్ చావదు పేరు మార్చుకుంటుంది అంతే  అని చెప్పే ప్రయత్నం చేసారు రామ్ గోపాల్ వర్మ ఇక ఈ సినిమా రివ్యూ లోకి వెళ్లి పోదాం 

కధ 
సత్య (శర్వానంద్) ఒక లక్ష్యం తో  హైదరాబాద్ చేరుకుంటాడు  అలా వచ్చిన సత్య  మాఫియా బ్యాక్ డ్రాప్ వున్నా ఒక ప్రముఖ బిల్డర్ దగ్గర పని లో చేరతాడు తన తేలివి  తేటలతో వాళ్ళకి వున్నా కొన్ని కష్టాలను సత్య తొలగిస్తాడు . దాంతో సత్య అంటే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది ఈ తరుణం లోనే సత్య ఒక కంపెనీ స్థాపిస్తాడు దానికి వాళ్ళు నిధులు సమకూరుస్తారు  ఇంతకి సత్య స్థాపించిన కంపెనీ ఏంటి ? సత్య లక్ష్యం  చేరుకున్నాడ ? తెలుసు కోవాలి అంటే మీరు  సినిమా చూడాలి 

ప్లస్ పాయింట్స్ 
రామ్ గోపాల్ వర్మ దర్సకత్వం ,శర్వానంద్ నటన  మెయిన్ హైలైట్ అని చెప్పాలి 
ఎక్కువ డైలాగ్ లు లేకపోయినా తన  నటన తో ప్రేక్షకులను ఆకట్టు కున్నాడు శర్వానంద్ 
రామ్ గోపాల్ వర్మ సత్య ని చూపించిన విధానం హైలైట్ అని చెప్పాలి 
సత్య సినిమా ని ప్రేక్షకుడు ఎంతో  ఇంట్రెస్ట్  గా చూసేలా తెరకెక్కించడం లో రామ్ గోపాల్ వర్మ విజయం సాధించారు 26/11 తరవాత మరో మంచి ప్రయత్నం సత్య 
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పెద్ద ప్లస్ పాయింట్ 
 డైలాగ్స్  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  చాల బాగున్నాయి 
పాటలలో అనైక అందాలు ప్రేక్షకులను ఆ కట్టుకుంటాయి 

 మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్లో గా వుంటుంది  
హీరో ట్రైన్ లోంచి దిగడం మాఫియా రన్ చేయడం బిజినెస్ మాన్ సినిమా గుర్తుకు వస్తుంది 
ఫస్ట్ హాఫ్ చూసినవాడు సెకండ్ హాఫ్ అదిరిపోతుంది అనుకుంటాడు కానీ అనుకున్న అంచనాలు చేరలేదు అని చెప్పాలి 
శర్వానంద్ తప్ప అందరు కొత్త వారు కావడం కూడా  ఒక మైనస్ తెలుగు నేటివిటీ మిస్ అయినట్టు వుంటుంది కొన్ని సీన్స్ లో 
పాటల ఫై కొంచం దృష్టి పెట్టాల్సింది 
సినిమా చివరిలో సత్య ఇదంతా ఎందుకు చేసాడో తరవాత చెప్తా అంటారు సరైన ముగింపు లేదు ఇది ఒక మైనస్ 

చివరిగా చెప్పేది : ఈ సినిమా ఒక సారి ఈజీ గా చూడచ్చు రామ్ గోపాల్ వర్మ సినిమా లు నచ్చే వారికీ ఈజీ గా నచ్చుతుంది . కామెడీ , ఫ్యామిలీ ఇలాంటి కోరికలు వున్నా వారికీ ఈ సినిమా పెద్ద నచ్చదు   చిన్న చిన్న లోటు పాట్లు పక్కన పెడితే సినిమా బాగుంది అని చెప్పడం లో సందేహం లేదు 
by sandeep

Contactusat Telugucinemas.in@gmail.com 

https://www.facebook.com/MATELUGUCINEMA  www.twitter.com/Matelugucinema

Post a Comment

Previous Post Next Post