త్వరలో దక్షిణాదిసినిమా వందకోట్ల మార్క్ ను దాటుతుందని ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ల ఎన్ని సినిమాలు వచ్చినా ఆ మైలురాయిని చేరుకోవడం గగనంగా మారిందన్నాడు. ఐఎన్ ఎస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో నాగార్జున పలువిషయాల్ని పంచుకున్నారు. బాలీవుడ్ ఇప్పటికే ఆస్థానాన్ని అందిపుచ్చుకోగా, దక్షిణాది సినిమా మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉందని తెలిపారు. ఆ భర్తీ త్వరలో పూర్తి చేస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
రాబోవు రెండు-మూడు సంవత్సరాల్లో దక్షిణాది సినిమా కూడా మరింత ముందుకు దూసుకుపోతుందన్నారు. ప్రస్తుతం తమిళ సినిమా ఆ కోవలో పయనిస్తుండటం ఆనందదగ్గ విషయమని పేర్కొన్నారు. గత సంవత్సరం రూ.70 కోట్ల పెట్టుబడితో విజయ్ హీరోగా వచ్చిన దక్షిణాది సినిమా తుపాకీ రూ.80 కోట్ల మార్క్ ను దాటటం కూడా శుభసూచకమన్నారు. అంతకుముందు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన 'ఎంథిరన్' (తెలుగులో శివాజీ) రూ.200 కోట్లను మార్కెట్ కు చేరి భారతీయ సినీ చరిత్రలో రికార్డు నెలకొల్పిన విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు.
బాలీవుడ్ సినిమా వంద కోట్ల మార్కు దాటి వెళ్లడానికి అక్కడ ఉన్న మార్కెట్ పెద్దది కావడం, స్థానిక పరిస్థితులే కారణమని తెలిపారు. హిందీ సినిమాలో 2,000లకు పైగా మల్టీప్లెక్స్ థియేటర్లలో విడుదలవుంతుటే, తెలుగు సినిమాలు 200 మల్టీప్లెక్స్ల్ ల్లో మాత్రమే విడుదలవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నాగార్జున గుర్తు చేశారు.
హిందీ సినిమాలో ఎక్కువ శాతం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నాయని, దక్షిణాది సినిమాలు ఇంకా అంత స్థాయిని అందిపుచ్చుకోవటంలో విఫలమవుతున్నాయని తెలిపారు. దక్షిణాది సినిమాల్లో కథ బలంగా తక్కువగా ఉండటం కూడా వైఫల్యాలకు ప్రధాన కారణంగా కనబడుతుందన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ దక్షిణాదిన మంచి మార్కెట్ తో చరిత్ర సృష్టిందని విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు. ఆ సినిమా తమిళనాట మొదటి మూడోవారాల్లోనే రూ.8 కోట్లను వసూలు చేసి సంచలన విజయం దక్కించుకోవడం వెనుక కథ బలమే ముఖ్యకారణమన్నారు..