Anthaka Mundhu Aa Taravatha Audio Launch On May25th-Telugucinemas.in



ఈ నెల 25న 'అంతకుముందు ఆ తరువాత' ఆడియో విడుదల 


ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'శ్రీ రంజిత్ మూవీస్' రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం 'అంతకుముందు ఆ తరువాత'. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ  ఇంద్రగంటి దర్శకుడు.త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం... ఆడియో వేడుక ఈ నెల 25న హైదరాబాద్ లో చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుగుతుందని నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ తెలిపారు.

సంగీత దర్శకుడు 'కల్యాణి కోడూరి' ఈ చిత్రానికి వీనుల విందైన సంగీతాన్ని సమకూర్చారు.'అలా మొదలైంది' లానే ఈ చిత్రం ఆడియో కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేసారు చిత్ర దర్శక,నిర్మాతలు. సుప్రసిద్ధ గీత రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాంలు ఈ గీతాలను రచించారు.తన సంగీత ప్రయాణంలో ఇదో మంచి చిత్రంగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి.

'అంతకుముందు ఆ తరువాత' ఓ ఉద్వేగభరిత ప్రేమ కధా చిత్రం' అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. వాస్తవికత ఉట్టిపడే సన్నివేశాలు, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలు, అనుభవాల సమ్మిళితమే ఈ చిత్రం అన్నారాయన.

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో..రవిబాబు,రావురమేష్,ఉప్పలపాటి నారాయణరావు,అవసరాల శ్రీనివాస్,తాగుబోతు రమేష్, కల్యాణిమాలిక్,పమ్మసాయి,సోహైల్,కె.ఎల్.ప్రసాద్, రోహిణి,మధుబాల,ప్రగతి,ఝాన్సీ,సుదీప,మాధవి,స్నిగ్ధ,అర్చన,అపర్ణ శర్మ నటిస్తున్నారు
.
సంగీతం: కల్యాణి కోడూరి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాం, గాయనీ గాయకులు: సునీత,హేమచంద్ర,కల్యాణి కోడూరి,స్రవంతి,శ్రీకృష్ణ,కాలభైరవ,కోగంటిదీప్తి, కెమెరా:పి.జి.వింద:ఎడిటింగ్; మార్తాండ్.కె.వెంకటేష్: ఆర్ట్;ఎస్.రవీందర్:నృత్యాలు;నోబుల్,సుచిత్ర,పాపి, కాస్ట్యూమ్ డిజైనర్స్:రాజేష్,భరత్:మేకప్;మోహన్: పబ్లిసిటి డిజైనర్:ఆర్.విద్యాసాగర్: ఫైనాన్స్ కంట్రోలర్: మాకినేని సర్వేశ్వరరావు: ప్రొడక్షన్ కంట్రోలర్:కె.శ్రీనివాసరాజు: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ముప్పాల హరికృష్ణ:: ఛీఫ్ కో డైరక్టర్: కొల్లి రాంగోపాల్ చౌదరి:

                  సహనిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి.వి 
                               నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్

                  కధ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

Sumanth Ashwin, Eesha ‘Anthaku Mundu Aa Tharvatha’ directed by Indraganti Mohan Krishna Currently its in shooting stage This movie Audio on 25th Ma y. KL.Damodara Prasad is producer of the film Kalyani Koduri(kalyani malik) is the music director. Ravi Babu, Madhubala, Pragathi,Jhansi Acting in this movie staytuned for more Details
Previous Post Next Post