Srikanth Meghana Movie Completed Second Schedule --Telugucinemas.in

శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ ప్రొడక్షన్ నెం: 2 తొలి షెడ్యూల్ పూర్తి


 యాక్షన్.సెంటిమెంట్ నేపధ్యంలో జరిగే ఓ వైవిధ్యమైన కధతో దర్శకునిగా తన తొలి చిత్రం రూపొందుతోందని జర్నలిస్ట్ 'ప్రభు' అన్నారు. ఆయన దర్శకునిగా ప్రముఖ కధానాయకుడు శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది..ఈ సందర్భంగా నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 15 వరకు హైదరాబాద్ లోని పలు ప్రదేశాలలో చిత్రం షూటింగ్ జరిపాము. రామోజీ ఫిలిం సిటీ లో ఓ గీతాన్ని, పోరాట దృశ్యాలను కూడా చిత్రీకరించటం జరిగింది, 'దేవుడినైనా అప్పుల్లో' అంటూ సాగే ఓ గీతాన్ని శ్రీకాంత్, చిత్రం శ్రీను, రఘు, ప్రభు లతో పాటు మరికొంతమంది నృత్య తారలు పాల్గొనగా కృష్ణారెడ్డి నృత్య దర్శకత్వంలో చిత్రీకరించగా, కాసర్ల శ్యాం రాసారీ గీతాన్ని. అలాగే శ్రీకాంత్ ,ప్రతినాయకుడు పోసాని క్రిష్ణమురలి బృందంపై పోరాట దృశ్యాలను చిత్రీకరించామని దర్శక,నిర్మాతలు తెలిపారు. కధానాయకుడు శ్రీకాంత్ 'దొంగ' గా, నాయిక మేఘన 'టీచర్' గా కనిపిస్తారీ చిత్రం లో అని దర్శకుడు జర్నలిస్ట్ 'ప్రభు' తెలిపారు. మే 1 నుంచి తదుపరి షెడ్యూల్ జరుగుతుంది. జులై నెలలో చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఆయన అన్నారు. ఇతర పాత్రలలో పోసానిక్రిష్ణమురలి,చిత్రంశ్రీను,రవివర్మ,కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు. కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి: సంగీతం: సాయికార్తీక్:పాటలు: శ్యాం కాసర్ల ఎడిటింగ్: నాగిరెడ్డి :సమర్పణ: జ్యోత్స్నారెడ్డి : నిర్మాత: రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి: స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు
 Srikanth's new film under the direction of senior journalist Prabhu  produced by .Rajarajeshwari pictures completed second schedule 
Previous Post Next Post