డబ్బింగ్ సీరియల్స్ ను వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా తెలుగు టీవీ పరిశ్రమ పరిరక్షణ సమితి చేస్తున్న
పోరాటానికి స్పందిస్తూ తొలుత ఈ టీవీ, తరువాత జెమినీ టీవీ, తమ వ్రాత పూర్వకంగా
ఆమోదం తెలుపుతూ పత్రాలు అందచేసారు. అదే విదంగా ఆర్వీస్ ఛానల్ అధినేత
ఆర్ వేంకటస్వామి సంతోషంగా స్పందిస్తూ 21మార్చ్ ఉదయం తమ సంస్థ కార్యాలయ ప్రాంగణం లో
కోర్ కమిటి సబ్యుల సమక్షం లో వ్రాతపూర్వకంగా ఇస్తానని తెలిపారు. ఇక వున్నవి మా టీవీ, జీ టీవీ.
డబ్బింగ్ సీరియల్స్ ఆపేవరకు ఈ పోరాటం కొనసాగిస్తామని,మూడు చానల్స్ స్పందించిన విధంగానే
మిగతా చానల్స్ లేఖలు ఇస్తే సరి లేదంటే మా పోరాటం ఇంకా ఉదృతం చేస్తాం. ప్రతిరోజూ మా టీవీ జీ టీవీ ఆఫీసు లముందుమా నిరసన ప్రదర్శన ఉంటుందని, అప్పటికి వారు డబ్బ్బింగ్ సీరియల్స్ ను ఆపకపోతే ఆమరణ నిరాహార దీక్షలు తలపెడతం అని కోర్ కమిటి కన్వినర్ డి సురేష్ కుమార్ తెలిపారు.
ఈ సందర్బం గ ఈ రోజు జీ టీవీ ఎదురుగా నిరసన ధర్నా చేసారు.
ఈ ధర్నాలో కోర్ కమిటి సబ్యులు ప్రసాద్ రావు, విజయ్ యాదవ్, షెర్లి, బృంద, కే రమేష్ బాబు, వైభవ్, మోహన్ రాజ్ , జమాల్, ప్రభాకర్, యాటా సత్యనారాయణ, పాల్గొన్నారు .