ఆ సినిమా వల్ల జ్ఞానోదయమైంది
ఈతరం యువ కథానాయకుల్లో శర్వానంద్ కొంచెం డిఫరెంట్. క్వాంటిటీ కన్నా క్వాలిటీకే ప్రాధాన్యమిస్తాడు తను. ‘జర్నీ’తో తమిళంలో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్న శర్వానంద్ ప్రస్తుతం చేరన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘ఏమిటో ఈ మాయ’ సినిమా చేస్తున్నారు. చెన్నైలో ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న శర్వానంద్‌తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ.
ఈ మధ్య ఎక్కువ చెన్నైలోనే ఉంటున్నారు. అక్కడే స్థిరపడిపోతారా?
‘ఏమిటో ఈ మాయ’ షూటింగ్ చాలా రోజులుగా చెన్నైలోనే జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ ఇక్కడే ఉండాలి. చెన్నైలో స్థిరపడతానా లేదా అనేది ప్రస్తుతానికి చెప్పలేను. నటుడనే వాడు ఏ భాషలో అవకాశమొచ్చినా చేయాలి కదా. నేనూ అంతే.
తమిళంలో మీకు బాగానే క్రేజ్ వచ్చినట్టుంది?
అవును. తెలుగులో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇంతకుముందు మురుగదాస్ నిర్మాణ సంస్థలో ‘జర్నీ’ చేశా. ఇప్పుడేమో ప్రముఖ దర్శకుడు చేరన్‌తో చేస్తున్నా. తమిళం కూడా నేర్చుకున్నా. డబ్బింగ్ కూడా చెప్పాలనుకుంటున్నా.
ఇకపై ఏ సినిమా అయినా తెలుగు, తమిళ భాషల్లో అయితేనే చేస్తారా?
అలా ఏంలేదు. అన్ని కథలు రెండు భాషలకూ నప్పవు. పరిస్థితుల బట్టి చేస్తుంటాను.
రామ్‌గోపాల్ వర్మ ‘సత్య 2’లో అవకాశం ఎలా వచ్చింది?
‘కో అంటే కోటి’ షూటింగ్ టైమ్‌లో ఆయన్ని కలిశాను. అప్పుడే ‘సత్య 2’ కథ చెప్పారు. నేను బాగా ఇంప్రెసయ్యా. ఏదో కథ చెప్పారనుకున్నాగానీ, అందులో నన్నే హీరోగా తీసుకుంటున్నారని నాకు తెలీదు. తెలిశాక చాలా షాకయ్యాను. వర్మ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదు. మొన్నే ముంబయ్‌లో అయిదు రోజులు షూటింగ్ చేసొచ్చా. మళ్లీ వెళ్లాలి.
హిందీలో కూడా కంటిన్యూ అవుతారా?
మంచి కథ దొరికితే కచ్చితంగా చేస్తాను. హిందీ అనే కాదు, ఏ భాషలోనైనా నాకు మంచి కథ కావాలి.
తోటి హీరోలంతా ‘మాస్’ మంత్రం జపిస్తుంటే, మీరు వైవిధ్యానికే ప్రాధాన్యమిస్తారు?
నాది మొదటినుంచీ అదే పంథా. అదృష్టవశాత్తూ మంచి కథలు దొరుకుతున్నాయి. కామెడీ అనో, మాస్ అనో ఒక బ్రాండ్‌కి పరిమితం కావడం నాకిష్టం లేదు. శర్వానంద్ మంచి నటుడు అనిపించుకోవాలనేదే నా లక్ష్యం. అలాగని మాస్ చేయనని కాదు.
ఈ విషయంలో మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు?
ఆమిర్‌ఖాన్. తన కథల ఎంపికే చాలా విభిన్నంగా ఉంటుంది. ఓసారి ‘రంగ్‌దే బసంతి’... ఇంకోసారి ‘తారే జమీన్‌పర్’... మరోసారి ‘త్రీ ఇడియట్స్’. తన సినిమాల్లో మంచి ఫీల్‌తో పాటు జనాకర్షణ శక్తి ఉంటుంది.
ఈ మధ్య ‘కో అంటే కోటి’తో నిర్మాతగా మారారు కదా. ఏంటి పరిస్థితి?
ఈ సినిమా వల్ల నాకు లాభమొచ్చిందా, నష్టమొచ్చిందా అనే విషయం పక్కన పెడితే ఓ విషయంలో జ్ఞానోదయమైంది. సినిమా నిర్మాణం ఎంత కష్టమో, నిర్మాత పరిస్థితి ఏమిటో అర్థమైంది. అయినా మళ్లీ సినిమా తీస్తాను. అయితే ఇప్పుడు కాదు. నేను కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తా.
ఖాళీ దొరికితే అమెరికా వెళ్ళిపోతుంటారు. ఎందుకని?
అక్కడ మా అక్కవాళ్లు ఉంటారు. అక్కడకు వెళ్లి రిలాక్సవుతుంటా. అయినా ఈ మధ్య అమెరికా వెళ్లలేదు. షూటింగ్స్ బిజీ కదా.
ఇంతకూ పెళ్ళెప్పుడు?
అది మన చేతుల్లో ఎక్కడుంటుంది? మా ఇంట్లోవాళ్లు ఎప్పుడంటే అప్పుడు రెడీ.
భవిష్యత్తు ప్రణాళికలేంటి?
నిన్న మొన్నటి వరకూ కొంచెం రిలాక్సింగ్‌గా పని చేశా. ఇకపై అలా కాదు. ఏడాదికి అయిదు సినిమాలు కచ్చితంగా చేస్తా. నా టార్గెట్ అదే.