Ram Gopal Varma Exclusive Interview on 26/11-TeluguCinemas.in


26/11 సంఘటన నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది- రామ్ గోపాల్ వర్మ 
రామ్ గోపాల్ వర్మ- తెలుగు చలన చిత్ర మరియు భారతీయ చలన చిత్ర పరిశ్రమ గతి ని మార్చిన దర్శకుడు. ప్రయోగాలకు 

పేరు పెట్టిన వర్మ ఇప్పుడు మరో ప్రయోగానికి పునాది వేసాడు. అది 26/11 దాడి సినిమా. ముంబై పై 26/11 న ముష్కరులు తలపెట్టిన దాడికి తెర రూపం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా లోని మొదటి 15 నిమిషాలు ముంబై పోలీసులకు,దాడి బాధితులకు చూపించి ఒక కొత్త వొరవడి కి శ్రీకారం చుట్టాడు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక అయింది. ఈ సందర్భంగా మేము ఆయనతో 26/11 దాడి చిత్రం గురించి ముచ్చటించాము. ఆ ఇంటర్వ్యూ మీ కోసం ఆయన మాటల్లోనే- 
రామ్ గోపాల్ వర్మ గారు. మీ 26/11 దాడి చిత్రం బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక అయిన సందర్భం లో మీకు శుభాకాంక్షలు
                     ఓహ్ . థాంక్స్
ఫిలిం మేకర్స్ రెండు నిమిషాల ట్రైలర్స్ నుండి ముప్పై సెకెండ్ల టీసర్లకు వచ్చిన రోజుల్లో మీరు ఏడు నిమిషాల భాగం ఇంటర్నెట్ లో విడుదల చేసారు…పదిహేను నిమిషాలు పోలీసులకు, విక్టింస్ కు చూపించారు. మీరు మీ సినిమాలోని  ఏడు నిముషాలు ఎందుకు చూపించాల్సి వచ్చింది?
ఒక సినిమా మనం తీసినప్పుడు ఆ సినిమా దేని గురించి తీసాము అని ప్రేక్షకులకు చెప్పే ఉద్దేశ్యమే ట్రైలర్. 26/11 దాడి విషయానికి వస్తే అక్కడ ఏమి జరిగిందో అందరికి తెలుసు. ఎలా జరిగిందో  కొంతమందికే తెలుసు..నేను ఏమి జరిగింది కంటే ఎలా జరిగింది అనేది ఇక్కడ చెప్పాలి అనుకున్నాను. అందుకే చూసే ప్రేక్షకులకు ఏమిటి అనేదానికంటే ఎలా అన్న విషయం గురించి ఒక నిస్ష్పష్టమైన అభిప్రాయం కలిగించే ప్రయత్నమే ఇది . ఉదాహరణ కు తీవ్రవాదులు ఒక బోట్ లో వచ్చారు అన్న విషయం అందరికి తెలుసు కాని ఆ బోట్ లో ఏమి జరిగింది అన్న విషయం తెలియదు. ఇలాంటి విషయాల సమ్మేళనమే ఈ సినిమా.
మీ చిత్రం మొదట్లో మరియు ట్రైలర్ మొదట్లో ఈ సినిమా ఏ మతానికి వ్యతిరేకం కాదు అన్న ఒక డిస్ క్లైమర్  పెట్టారు. ఇంతకూ ముందు మీరు ఏ సినిమా లోను, ఎంత వివాదాస్పదం అయినా ఇలా పెట్టలేదు .ఇప్పుడు ఎందుకు ఇలా.?అంటే ఏదైనా కాంట్రవర్సీ వస్తుందని ముందు జాగ్రత్త గా అలా  పెట్టారా?
ఈ సంఘటన కు సంబంధించిన  మతాల మరియు వర్గాల సున్నితత్వాన్ని దృష్టి లో పెట్టుకొని మరియు ఈ సంఘటన మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన దాడి అని నేను ప్రగాడంగా నమ్మడం వల్ల అలాంటి ప్రకటన పెట్టాను. 
మీ 26 /11 చిత్రం లోని మొదటి పదిహేను నిమిషాలు మీరు పోలీసులకు, భాధితులకు చూపించారు.  చిత్రం విడుదల సమయం లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మీరు తీసుకున్న ముందు జాగ్రత్త చర్య గా భావించవచ్చా లేక ఈ సినిమా పబ్లిసిటీ లో బాగంగా ఇలా చేసారా?
అసలు పబ్లిసిటీ అంటే ఏంటిమనం చేస్తున్న పని వైపు నలుగురి దృష్టి ఆకర్షించడమే పబ్లిసిటీ. సినిమా లక్ష్యమే పబ్లిసిటీ అయినప్పుడు నేను పబ్లిసిటీ కోసం పని చెయ్యడం లేదు అని ఎలా చెప్పగలనుఅది పక్కన పెడితే వాళ్ళు నాకు అందించిన అసాధారణమైన ప్రోత్సాహానికి కృతజ్ఞత గా నేను వాళ్లకు చూపించాను. నిజం చెప్పాలంటే వాళ్ళంతా ఈ చిత్రం లో భాగస్వాములే.
మన దేశం లో ఎలక్ట్రానిక్ మీడియా శక్తివంతం అయ్యాక బాగా( extensive ) గా కవర్ చెయ్యబడ్డ సంఘటన 26 /11 . ఈ సంఘటన ప్రతి క్షణాన్ని దేశం చూసింది. మరి మీరు మీ సినిమా లో కొత్త గా ఏమి చూపించబోతున్నారు? అసలు ప్రేక్షకులు మీ చిత్రం నుండి ఏమి ఆశించవచ్చు?
నేను ముందే చెప్పినట్లు ఏమి జరిగింది అన్న విషయం అందరికి తెలుసు కాని ఎలా జరిగింది అన్న విషయం కొద్దిమందికే తెలుసు. ఉదాహరణ కు ముంబై పై దాడి లియోపోల్డ్ కెఫె లో మొదలయినప్పుడు ముంబై జాయింట్ కమీషనర్ ఇంట్లో స్నానం చేస్తున్నారన్న విషయం మీకు తెలుసాసలాస్కర్కామ్తెకర్కరే చంపబడినప్పుడు వాళ్ళ క్వాలిస్ లో వెనక సీట్ లో దాక్కున్న కానిస్టేబుల్ అనుభవం మీకు తెలుసాఇలాంటి సంఘటనలుఅనుభవాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి.
రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే అందులోని చెడ్డ వాళ్ళను గ్లోరిఫయ్ చేస్తాడు అని కొంత మంది అభిప్రాయం. ఈ చిత్రం లో కూడా కసబ్ ను గ్లోరిఫయ్ చేసి ఉంటాడు అని వాళ్ళ అనుమానం. ఈ విషయం పై మీ అభిప్రాయం ఏంటి?
నేరస్తులను గ్లోరిఫై చేస్తాడు అని నా పై సత్య సినిమా చేసినప్పటి నుండి ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కాని నా ఉదేశ్యం నేరస్తుడిని చూపించడం కాదు. ఆ నేరస్థుడి స్వభావం అర్థం చేసుకోవడం. వారిలోని మానవీయ కోణాన్ని చూపనంతవరకు ఒక నేరస్థుడి నిజమైన స్వభావం అర్థం చేసుకోలేమని నా అభిప్రాయం. అర్థం చేసుకోవడాన్ని సమర్ధించడం గా భావిస్తే అది చాలా తప్పు.
రామ్ గోపాల్ వర్మ  పబ్లిసిటీ  కోసం ఏమైనా చేస్తాడు. కేవలం తన సినిమా పబ్లిసిటీ  కోసమే కసబ్ ను ఉరి తీసిన రెండు రోజులకే ఈ సినిమా టీజర్  విడుదల చేసాడు అని కొంత మంది అభిప్రాయం. ఈ రోజునే చెయ్యాలని ముందే అనుకున్నారా లేక అందరు అనుకున్నట్లు పబ్లిసిటీ  కోసం కసబ్ చనిపోయిన రెండు రోజులకే విడుదల చేసారా?
అది కేవలం యాదృచ్చికం మాత్రమే. మేము ఆ తేదిన ట్రైలర్  విడుదల చెయ్యాలి అని ప్లాన్ చెయ్యలేదు. రెండు రోజుల్లో పదిహేను నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ తయారు చెయ్యడం సాధ్యం కాదు. అంత తక్కువ సమయం లో ఇది సాధ్యం కాని పని. అయినా ఒక వేళ కసబ్ ను ఆ రోజు ఉరి తీస్తారు అని నాకు ముందే తెలిసి ఉంటె కూడా ట్రైలర్ ఆ రోజే విడుదల చేసేవాడిని. 
26 /11 తర్వాత మీరు తాజ్ హోటల్ వెళ్ళినప్పుడు మీరు ఈ సినిమా తీస్తున్నారని అందుకే తాజ్ హోటల్ వెళ్ళారని న్యూస్ వచ్చింది. మీరు 26 /11 పై సినిమా తీయడం లేదు అని అప్పుడు అన్నారు కాని ఇప్పుడు 26 /11 పై మీ సినిమా విడుదల కు సిద్ధం కూడా అవుతోంది. మరి అప్పుడు మీరు అప్పుడు కాంట్రవర్సీ అవ్వకూడదు అని సినిమా తియ్యడం లేదు అని చెప్పారా? ఈ సినిమా తీయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు?
నేను ఆ సంఘటన జరిగిన రోజు నుండి ఎన్నో సార్లు ఈ విషయం పై వివరణ ఇచ్చాను. నేను తాజ్ హోటల్ ఆ సంఘటన జరిగిన మరురోజే వెళ్ళాను.అప్పటికి పోలీస్ విచారణ కూడా స్టార్ట్ కాలేదు. అంత త్వరగా నాకు ఏమి తెలుస్తుంది.అందువల్ల సినిమా ఆలోచన తోనే నేను తాజ్ హోటల్ వెళ్ళాను అనడం మూర్ఖత్వం. ఇకపోతే ఇప్పుడు విచారణ పూర్తి అయింది. ఉన్నత వర్గాల నుండి నిజానిజాలు బయటకు వచ్చాయి. అందుకే ఈ సినిమా ఇప్పుడు తీస్తున్నాను..
మీరు ఈ చిత్రం కోసం ఎంతో రిసెర్చ్ చేసాను అని చెప్పారు. బాధితులను, వాళ్ల బంధువులను కలిసాను. వాళ్ళ బాధ నన్ను కదిలించింది అన్నారు.ఈ చిత్రం తీయాలి అనుకున్నాక బాదితులను కలిసారా లేక వాళ్ళను కలిసివాళ్ళ బాధ అర్థం చేసుకున్నాక చిత్రం తీయాలి అని నిర్ణయించుకున్నారా?
నేను ఈ చిత్రం తీయాలి అని నిర్ణయించుకున్న తర్వాతే వాళ్ళను కలిసాను. కాని వాళ్ళను కలిసిన తర్వాత వాళ్ళ అనుభవాలు విన్న తర్వాతవాళ్ళ బాధ అర్థం చేసుకున్న తర్వాత ఈ సినిమా పై నా దృష్టికోణంఆ సంఘటన పట్ల నా అభిప్రాయాలలో చాలా మార్పు వచ్చింది.
మీరు ఈ సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు బాదితులు ఎలా రియాక్ట్  అయ్యారు? ఎవరైనా మిమ్మల్ని ఈ సినిమా తీయకండి అని కోరారా?
ఒక సంఘటన ను ఒకొక్కరు ఒక్కో  రకంగా  అర్థం చేసుకోవడం సహజం.అలాంటప్పుడు వారికి వాళ్ళు నమ్మినదానిపై ఒక స్ట్రాంగ్ వ్యూ పాయింట్ ఉండటం కూడా సహజం. నన్ను ఎవరు ఈ సినిమా తీయకండి అని కోరలేదు కాని ఏది ఎలా చూపాలిఏ సంఘటన ను హై లైట్ చెయ్యాలి అన్న విషయం పై వాళ్ళ అభిప్రాయాలు తెలిపారు.    
ఈ చిత్రం వల్ల పాత గాయాలు మళ్లీ రేగే అవకాశం ఉంది. జీవితం లో మర్చిపోదగ్గ ఆ రెండు రోజులు మీరు గుర్తుచెయ్యడం ముంబై లో ఉండే వాళ్ళకు మనస్తాపం కల్గించవచ్చు అని కొంత మంది భావన. మీ అభిప్రాయం ఏంటి ?
అవి అమాయకత్వం తో కొంత మంది చేసే ఆరోపణలు మాత్రమే. మన జీవన గతి ని మార్చిన26/11 లాంటి సంఘటనల వెనుక ఏమి జరిగిందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉత్సుకత ఉంటుంది. అలా తెలుసుకోవడం వలన ఆ సంఘటలను మనం సరైన విధంగా అర్థం చేసుకోగలము అని నా అభిప్రాయం.

రామ్ గోపాల్ వర్మ తన ఎమోషన్స్ పబ్లిక్ లో చూపడు అని చాలా మంది అభిప్రాయం. బహుశా సోషల్ నెట్వర్కింగ్ లో మరియు మీ బ్లాగ్ లోని సమాధానాల వాళ్ళ అలా అనుకోని ఉండవచ్చు. ఈ సినిమా కోసం మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో బాధితుల్ని   కలిసినప్పుడు వాళ్ళ బాధ విని గుండె తరుక్కుపోయింది, కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి అని అన్నారు. మానవత్వం పైన జరిగిన దాడిగా మీరు ఈ సంఘటన ను అభివర్ణించారు. ఒక వ్యక్తీ గా , ఒక ఫిలిం మేకర్ గా ఈ సంఘటన మిమ్మల్ని ఎలా ప్రభావితులను చేసింది. మీరు అంత స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి?
ఒక మనిషి తన అనుభవాల మిశ్రమం మాత్రమే. అవి బౌతికమైన అనుభవాలు కావచ్చుమన ఆలోచనలుఅభిప్రాయాలకు సంబందించినవి. మన అనుభవాల సారమే మనం ఆలోచించే విధానాన్ని నిర్దేశిస్తుంది. 26/11 విషయానికి వస్తే నేను ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉండక పోయి ఉండొచ్చు,బాదితుల బాధ స్వయంగా  అనుభవించకపొయి ఉండవచ్చు కాని వాళ్ళతో మాట్లాడటం ద్వారావాళ్ళ తో సమయం గడపటం వలన  వాళ్ళ అనుభవాలనుబాధ ను,ఆవేదనను చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగింది. వాళ్ల బాధ నాలోని మనిషి ని తట్టి లేపింది. నేను నా భావోద్వేగాలు అంతగా ఎక్స్ ప్రెస్ చేసాను అంటే అదే కారణం. ఈ సంఘటన వాళ్ళ నాలో వచ్చిన మార్పు ను మీరు నా సినిమాలలోవ్యక్తిగతం గా నాలో కచ్చితంగా చూస్తారు. 
ఇంకో surprise ఏంటంటే కసబ్ ను ఉరి తీసారు అన్న వార్తకు మీ రియాక్షన్. మీరు ఇది 26 /11 కు ఇది హ్యాపీ ఎండింగ్ అన్నారు. నిజం చెప్పాలంటే మీ నుండి అంత సింపుల్ రియాక్షన్ ఎవరు ఊహించలేదు. నిజం చెప్పండి.కసబ్ ను చంపడం తో ఈ కథ ముగిసింది అంటారా? మరి ఈ సంఘటన వెనక ఉన్న మిగితా వాళ్ళ మాట ఏంటి?
ఈ సంఘటనకు సహజమైన ముగింపు కసబ్ వంటి హేయమైన మనిషి చావే అని నా అభిప్రాయం. అతను చేసిన క్రూరమైన హత్యలకు శిక్ష అతని మరణం  మాత్రమే. అతను చేసిన హేయమైన చర్యలకు భాదితులైన వ్యక్తులకు న్యాయం అతని చావుతోనే లభించింది అని నా అభిప్రాయం.
మరో ఇంటర్వ్యూ లో మీరు ఈ సినిమా ఇప్పటి వరకు మీ బెస్ట్ వర్క్ అన్నారు. ఈ చిత్రం మీ బెస్ట్ అని ఎందుకు అనుకుంటున్నారు?
నిజం చెప్పాలంటే 26/11 దాడి ఒక సినిమా కాదు. స్వాతంత్ర్యానంతరం  మన దేశం లో జరిగిన అతి హేయమైనక్రూరమైన సంఘటనకుమానవత్వం పైన జరిగిన దాడికి తెరరూపం ఈ సినిమా. ఈ సంఘటన కు సంబంధించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ మెటీరియల్ ను దృష్టి లో పెట్టుకుంటే నేను పూర్తిగా న్యాయం చేసాను అని నాకు అనిపిస్తుంది. ఆ రకంగా చూస్తే ఇది ఇప్పటివరకు నేను చేసిన సినిమాలలో నా బెస్ట్ వర్క్ అని ఖచ్చితంగా చెప్పగలను. 
ఇది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. మీరు హిందీ, ఇంగ్లీష్, తెలుగు లో విడుదల చేస్తున్నారు. మిగతా భాషలలో  కూడా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలు ఉన్నాయా?
అవును ఈ సినిమాను సాధ్యమైనన్ని బాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తాము. ఎందుకంటే సాధ్యమైనంత మంది ప్రజలు ఈ సంఘటన వెనుక జరిగింది ఏమిటో తెలుసుకోవాలి అని మా ఉద్దేశ్యం. ఇకపోతే ఈ చిత్రం ఇంగ్లీష్ వర్షన్ ఒకటి మేము విశ్వవ్యాప్తంగా కూడా విడుదల చెయ్యబోతున్నాము.
మీరు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని, ఇలాంటి హేయమైన ఘటన వెనుక జరిగింది ఏమిటో అందరు తెలుసుకోవాలని, ఇలాంటి సంఘటనలు మరిన్ని జరక్కుండా జాగ్రత్త పడతారని మా ఆశ, ఆకాంక్ష.
థాంక్స్
   (Interview చేసిన బ్రహ్మ గారికి ధన్యవాదాలు )

Post a Comment

Previous Post Next Post