
దర్శకత్వం - తనికెళ్ల భరణి
నిర్మాత - ఆనంద మయిద రావు
కథ - శ్రీ రమణ
స్క్రీన్ ప్లే - తనికెళ్ల, జొన్నవిత్తుల
నటులు - ఎస్ పి బాలు, లక్ష్మి
సంగీతం - స్వర వీణాపాణి
సినిమాటోగ్రఫీ - రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల
ఎడిటింగ్ - ఉద్దవ్
ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. ఇంత అద్భుతమైన సినిమా.. బాగుందనో.. లేక బాగోలేదనో.. చెప్పడానికి నేను ఈ రివ్యూ రాయడం లేదు. ఓ మంచి సినిమాను ఆదరిస్తే.. మరో నలుగురు.. ఇలాంటి ప్రయత్నాలు చేయకపోతారా అనేది నా ఆలోచన.మంచి సినేమాలు లేవు మంచి సినిమా లు రావు అని గగ్గోలు పెడుతున్న ఈ తరుణం లో మిధునం ఒక సమాధానం ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు చూసే మనకి ఈ సినిమా చాల కొత్త అనుభూతి ని కలిగిస్తుంది అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఇది ఒక్క అచ్చ తెలుగు సినిమా
. బాక్సాఫీసు రికార్డుల కోసం కాకుండా మంచి సినిమా ను అందించాలి అనే ఒక మంచి సంకల్పం తో భరణి గారు చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందించక తప్పదు
ఈ సినిమా ఎవరి అంచనాలకు అందని ఒక మంచి ఆవకాయ లాంటి సినిమా ఈ సినిమా చూసాక నాకు భరణి గారి మాటలు గుర్తుకు వచాయి . సినిమా నచ్చితే.. పది మందికి చెప్పండి.. నచ్చకపోతే.. వెయ్యి మందికి చెప్పండని.. తనికెళ్ల భరణి పదే పదే టీవీ ఛానళ్లలో చెప్పిన మాటలు నాకు గుర్తుకు వచాయి నాకు ఈ సినిమా నచ్చింది అయ్యిన నేను సినిమా .గురించి వెయ్య మందికి చెపుతాను అయన మాటలను బట్టే .ఆయనకు ఈ సినిమాపైనా, తన దర్శకత్వంపైనా, జనాల సున్నితత్వం, వాళ్లలోని మానవత్వం, తల్లిదండ్రులంటే ఉన్న గౌరవంపై ఎంత నమ్మకమో.అర్ధమయింది మిధునం... ఇది నిజంగా వెండితెరపై మిధునం. శ్రీరమణ గారు రాసిన ఓ చిన్న కథ ఆధారంగా రెండు గంటల సినిమా తీయడమంటే నిజంగా ఓ సాహసమే ఒక ప్రయోగమే .కేవలం రెండంటే రెండే పాత్రలు.ఒకటి బాలు గారు రెండు లక్ష్మి గారు . మూడో మనిషే ఈ సినిమాలో కనిపించడంటే మీకు ఆశ్చర్యం కలుగకమానదు. అంతే కాదు.. సినిమా అంతా ఒకే ఒక్క ఇంట్లోనే సాగుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. భార్యాభర్తలైన అప్పదాసు.. బుచ్చిలక్ష్మి మధ్య ప్రేమానురాగాలను.. ఒకరంటే.. ఒకరికి.. ఉన్న ఆప్యాయతను అద్భుతంగా చూపించారు. ఐదుగురు పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత.. వయసు మళ్ళిన తరువాత వారు ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఒకరంటే.. ఒకరు.. ఎంత ప్రాణప్రదంగా ఉంటారో.. తనికెళ్లభరణి కళ్లకు కట్టినట్టు చూపించారు. ఊరు అవతల.. ఓ విశాలమైన ఇంటిని నిర్మించుకుని, అందులో వాళ్లకు కావాల్సిన ఆహారాన్ని స్వయంగా పండించుకుంటూ.. ఏ చీకూ చింతా లేకుండా.. ఎలా ఉండొచ్చో కూడా చూపించారు. ఈ గంధర గోల మయన ప్రపంచం లో ప్రశాంతత ఎక్కడ వుందో వెతుకోవలసిన ఈ రోజుల్లో మిధునం లో ప్రశాంతత అంటే ఇది ఆనందం అంటే ఇది అని మన భరణి గారు చూపించిన తీరు అధ్బుతం , . సినిమా పూర్తయ్యే లోపు మన అమ్మానాన్నలు.. ఏదో ఒక సందర్భంలో మనకు తప్పక కనిపించి తీరాల్సిందే. అందులో సందేహమే లేదు. తిండిపై అమితమైన ప్రేమను కనబర్చడమే కాదు.. తిండి ప్రియుడిగా కూడా.. బాలసుబ్రమణ్యం గారు.. అద్భుతంగా నటించారు. బొద్దుగా ఉన్న ఆయన రూపం కూడా.. పాత్రకు అతికినట్టు సరిపోయింది. నిత్య సంధ్యలు చేయడంతో పాటు... వాళ్ల ఇంటి పెరట్లో మొక్కలు పండించడం, ఆవు పాలు పితకడం.. వంటి పనులన్నీ చేస్తూ.. బాలు గారు రోజంతా కాలక్షేపం చేస్తారు. అంతేకాదు చెప్పులు కుడతారు, దూది ఏకుతారు, బంగారం పని చేస్తారు.. అబ్బో.. ఆయన సకల కళా వల్లభుడిగా ఇందులో కనిపిస్తారు. ఆయన చేసే ప్రతీ చేష్టా నవ్వు తెప్పిస్తుంది. ఇక లక్ష్మి గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుచ్చిలక్ష్మిగా.. ఆమె తన పాత్రలో ఒదిగిపోయారు. అనువైన భార్య అంటే ఎలా ఉండాలో.. జనాలకు చూపించారు. భర్తపై కోప్పడ్తూనే.. ఆయనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ... ఆనందం పొందుతూ ఉంటారు లక్ష్మి. పూజలు, పునస్కారాలు, మౌనవ్రతాలే కాదు.. ఆమె చేతి వంటంటే.. బాలు గారు.. వేళ్లు కొరుక్కుంటారు. ఆమె చేసిన ప్రతీ వంటను ఆద్భుతః అంటూ.. లొట్టలు వేస్తూ తింటారు. అంతే కాదండోయ్.. ఈ సినిమాలో తెలుగు వంటకాలన్నీ చూస్తుంటే.. నోరు ఊరక మానదు తెలుగు వంటకాలను భరణి గారు ఈ సినిమా లో తెరకేకించిన విధానం అమోఘం ఫాస్ట్ ఫుడ్ లు డైట్ ఇంగ్ లు నడుస్తున్న ఈ రోజుల్లో తెలుగు ఇంటికి వంటకాలు చూపించి జనాలకు నోరురించారు రేడియోలోని వందేమాతరంతో రోజు మొదలుపెట్టడం చూస్తే.. మనకు మన పాత రోజులు కొన్నైనా గుర్తువస్తాయి. ఇప్పటి తరానికి ఆ రోజులు అల వుండేవ అని అనిపిస్తుంది చిన్ననాటి విషయాలు మన పూర్వికులు చెప్పే మాటలు మన తాతలు నాయనమ్మలు వాడే గ్రాంధిక పదాలు ఈ సినిమా లో కనిపిస్తాయి .ఈ సినిమాలో మన హీరో . అప్పదాసు ఇంట్లో టీవీ లేదు... ! జొన్నవిత్తుల గారు.. కాఫీపై రాసిన... ఓ పాట నవ్వుతెప్పించాల్సిందే. పొద్దున్నే కాఫీ పడకపోతే జనాలు పడే తాపత్రయం మొదలు.. జీవితంలో కాఫీకి ఉన్న ప్రాధాన్యతను చక్కగా వర్ణించారు. అంతేకాదు.. ఆవకాయ, గోంగూర ఉండగా.. ఈ పిచ్చి పిజ్జాలు, బర్గర్లూ.. మనకెందుకు అంటూ.. బాలూ గారు.. ఓ చిన్న పాట మాత్రమే పాడారు... ఈ సినిమా లో చిన్న పాట అది ఓపెనింగ్ పాటతో జేసుదాసు గారు.. . ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా సరుకే ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఒకరంటే.. ఒకరికి ఉండే అభిమానం.. చిన్న చిన్న సరదాలు, రొమాంటిక్ సన్నివేశాలు... మిధునంలో చాలానే చూపించారు. సినిమా ఆఖరి సన్నివేశం.. కాస్త హృద్యంగా ఉంటుంది. నేను సుమంగళిగా పోవాలని.. బుచ్చి లక్ష్మి, కాదు.. నేను ముందు పోతానంటూ.. బాలూ.. చెప్పడాన్ని చూస్తే.. బాధేస్తుంది. ఒకరు లేకపోతే.. మరొకరు.. ఎలా ఉంటారు.. ? ఎలా ఉండగలుగుతారు ? అనే సున్నితాంశాలు ఖచ్చితంగా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఈ సినిమా లో సంతోషం తో బాధను భరిణి గారు చూపించారు హృదయాన్ని అత్తుకునే సన్నివేశాలు కూడా చాలానే వున్నాయి .. ! చివర్లో ఓ మంచి సినిమా చూశామన్న తృప్తితో బయటకు వస్తాం నాకు మాతరం సినిమా కి వెళ్ళిన ఫీలింగ్ లేదు ఒక పల్లె టూరులో అచ్చ తెలుగు ఇంటికి వెళ్లి నట్టు వుంది ఈ సినిమా ను మనకి అందించిన భరణి గారికి నటించిన బాలు లక్ష్మి గారికి న శుభాకాంక్షలు ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలి అని కోరుకుంటున్న
నాగేంద్ర సాయి గారి సహకారంతో
Post a Comment