షూటింగు ప్రమాదంలో కెమెరా అసిస్టెంట్ మృతి
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇంటింటా అన్నమయ్య' చిత్రం షూటింగులో జరిగిన ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామేన్ బాలప్రకాష్ దుర్మరణం చెందాడు. విశాఖపట్నం సమీపంలోని అరకులోయలోని కోడిపుంజువలస ప్రాంతంలో జరుగుతున్న ఈ సినిమా షూటింగులో విద్యుత్ జనరేటర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కెమెరా అసిస్టెంట్ బాలప్రకాష్ అక్కడికక్కడే మరణించినట్టు తెలుస్తోంది. అలాగే, ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 'శ్రీరామరాజ్యం' చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగు ఈ నెల 1 నుంచి అరకు ప్రాంతంలో జరుగుతోంది. ఈ సినిమా లో యలమంచిలి సాయిబాబు కుమారుడు రేవంత్ హీరో గ
నటిస్తున్నాడు
Post a Comment