Nagarjuna Dontes his Remunation,Nagarjuna donates Shirdi Sai salary for charity,


నాగార్జున పెద్ద మనసు
నాగార్జున ... విభిన్నమైన పాత్రలను పోషిస్తూ అశేష ప్రేక్షకులను మెప్పిస్తోన్న అగ్ర కథానాయకుడు. తన తాజా చిత్రమైన 'శిరిడీ సాయి' సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తం ఒక స్వచ్చంద సంస్థ కు విరాళంగా ఇవ్వటానికి సిద్ధపడ్డారు. దీంతో ఆయన హీరోలకు ఇమేజే కాదు పెద్ద మనసు కూడా ఉంటుందని నిరూపించారు. తను విరాళంగా అందించనున్న మొత్తంలో కొంత భాగాన్ని అమల నడుపుతున్న బ్లూ క్రాస్ సంస్థకు కేటాయించడం జరుగుతుంది. దీంతో బ్లూ క్రాస్ సంస్థ జంతువులకు శస్త్ర చికిత్స కు సంబంధించిన అదనపు సౌకర్యాలు కల్పించనుంది. ఇక మిగిలిన మొత్తాన్ని సామాజిక అంశాలపై ఖర్చు చేయనున్నారు. ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకున్న నాగార్జున పై సర్వత్రా ప్రశంసలు జల్లు కురుస్తోంది.
Nagarjuna Dontes his Remunation,Nagarjuna donates Shirdi Sai salary for charity,

Post a Comment

Previous Post Next Post