ఐదు కంపెనీలపై కేసులు
పార్లమెంట్ లో బొగ్గు కుంభకోణంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో... సీబీఐ అధికారులు ఏకకాలంలో దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. ముంబై, కోల్‌కత్తా, పాట్నా, నాగపూర్ నగరాలలోని ప్రముఖ వ్యక్తులు, ఇళ్లలో దాడులు జరిపింది. 2006 -09 మధ్య జరిగిన బొగ్గు కేటాయింపులపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటి వరకు ఐదు కంపెనీలపై కేసు నమోదు చేసింది. ప్రైవేటు వ్యక్తులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులపైనా కేసులు నమోదయ్యాయి.
కేంద్ర మంత్రి ఉన్న సమయంలో దాసరి... బొగ్గు గనుల కేటాయింపుల్లో ఉదారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లోనే టన్ను 2వేల రూపాయలు పలుకుతుంటే... కేవలం 100 రూపాయల రాయల్టీతో కేటాయించారని ప్రధాన ఆరోపణ. ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా లేవనెత్తారు.
దాసరి వివరణ
మరోవైపు ఈ వ్యవహారంపై దాసరి వివరణ ఇచ్చారు. తనను ఎవరూ ప్రశ్నించలేదని స్పష్టం చేశారు. తన ఇంట్లో సోదాలు జరిపినట్టు మీడియాలో వస్తున్న వార్తలు కూడా అవాస్తవమని దాసరి నారాయణరావు ఓ ప్రకటన విడుదల చేశారు.
Post a Comment