Gabbar Singh 100 Days Details


పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'గబ్బర్ సింగ్'వంద రోజులు ఆగస్టు 17కి పూర్తవుతుంది. ఈ చిత్రం వంద రోజులు పంక్షన్ ని ఆగస్టు 18 లేదా ఆగస్టు 19న చేసే అవకాసముందని సమాచారం. హైదరాబాద్ లో అభిమానులు సమక్షంలో గ్రాండ్ గా ఈ ఫంక్షన్ చేయటానికి నిర్మాత గణేష్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు .ఈ సినిమా వంద రోజుల షో ని మలేషియా లో  భారి గ చేసేదుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే పవన్ కళ్యాణ్ డేట్స్ ఆధారం గ    ఈ డేట్ ఖరారు చేస్తారు అని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్..పూరి తో చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు బిజీలో ఉన్నారు. ఇక నిర్మాత గణేష్ బాబు ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని ఘనంగా చేద్దామని క్రిందటి నెలలో ప్లాన్ చేసారు. కానీ పవన్ ..వంద రోజులు పంక్షన్ చేసుకోమని సూచించటంతో వాయిదా వేసుకుని ఈసారి అభిమానులుకు ఆనందం కలిగించేలా ఓ రేంజిలో భారీ ఎత్తున చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ పంక్షన్ కి మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు ఇండస్ట్రీలోని మరికొందరు స్టార్ హీరోలు,ముఖ్యంగా బాద్షా ఎన్టీఆర్ హాజరవుతారని వినికిడి. ఎన్టీఆర్ చేస్తున్న బాద్షా కు గణేష్ బాబు నిర్మాత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం విజయవంతంగా 75 డేస్ పూర్తి చేసుకుని 100 రోజుల దిశగా  పరుగులు పెడుతోంది 

Post a Comment

Previous Post Next Post