Varun Sandesh And Nisha Agarwal New Movie



వరుణ్‌సందేశ్, నిషా ల చిత్రం
వరుణ్‌సందేశ్, నిషా అగర్వాల్ జంటగా శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. పత్తికొండ అర్పిత, పత్తికొండ కిషోర్, పత్తికొండ కిరణ్ నిర్మాతలు. పి.భానూశంకర్ దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి చంటి స్విచ్ఛాన్ చేశారు. బోయపాటి శ్రీను క్లాప్ నిచ్చారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ "ఇటీవల ఓ పాటను రికార్డింగ్ చేశారు. బాబా సెహగల్ పాడారు. గమ్మత్తుగా అనిపించింది. రవివర్మ మంచి బాణీలను సమకూరుస్తున్నారు. 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది'' అని అన్నారు.
నిషా అగర్వాల్ మాట్లాడుతూ "వరుణ్‌తో రెండో సారి సినిమా చేస్తున్నాను. పూర్తి ఎంటర్‌టైనర్ ఇది'' అని చెప్పారు. చిత్ర సమర్పకుడు పత్తికొండ కుమారస్వామి మాట్లాడుతూ "ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. రవివర్మ మంచి పాటలిచ్చారు. పాటలన్నీ బావున్నాయి'' అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ "వరుణ్‌కి చక్కగా సరిపోయే కథ ఇది. వైవిధ్యంగా ఉంటుంది. నావెల్టీగా అనిపిస్తుంది. నిషాకి ఈ సినిమాతో సౌందర్యకి వచ్చినంత పేరు వస్తుంది. బలభద్రపాత్రుని రమణి మంచి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. సురేంద్రకృష్ణ స్క్రీన్‌ప్లేలో బాగా సహకరించారు. ఐదు పాటలు బావుంటాయి. 26 నుంచి ఆగస్టు 14 వరకు ఓ షెడ్యూల్ చేస్తాం. నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని మరో షెడ్యూల్ మొదలుపెడతాం.
సినిమా పూర్తయ్యే వరకు చిత్రీకరిస్తాం'' అని అన్నారు. సుమన్, అలీ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, కృష్ణభగవాన్, రావు రమేష్, వేణుమాధవ్, ముమైత్‌ఖాన్, రాజేశ్వరి నాయర్, సురేఖావాణి, ఢిల్లీ రాజేశ్వరి, శ్రీలలిత, జ్యోతి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: రవివర్మ, పాటలు: చంద్రబోస్, సురేంద్రకృష్ణ, శ్రీమణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: డి.వై.సత్యనారాయణ, ఫొటోగ్రఫీ: శ్రీనివాస్.జి., కథా విస్తరణ: బలభద్రపాత్రుని రమణి, స్క్రీన్‌ప్లే సహకారం: సురేంద్ర కృష్ణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పి.భానూశంకర్

Post a Comment

Previous Post Next Post