హీరోల పిల్లలు అప్పుడప్పుడు తమ డాడీల షూటింగులకు వచ్చి సందడి చేస్తుంటారు. పవన్ కల్యాణ్ ముద్దుల తనయుడు అకీరా నందన్ మాత్రం అరుదుగా షూటింగ్ స్పాట్ కి వస్తుంటాడు. ఇటీవల 'కెమెరామేన్ గంగతో రాంబాబు' చిత్రం షూటింగుకి కూడా అలాగే వచ్చి,అందరిని ఆశ్చర్య పరిచాడు హైదరాబాదు, పద్మాలయా స్టూడియోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగులో అకీరా ప్రత్యక్షమయ్యాడు షూటింగు స్పాట్లో తను వున్న ఆ కాస్సేపు... మనవాడు చాలా సందడి చేశాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. డైరెక్టర్నీ, కెమెరామేన్ నీ, ఇతర ఆర్టిస్టులనీ అందర్నీ నవ్వుతూ పలకరించి... షూటింగుని ఆసక్తికరంగా తిలకించాడట. అకీరా గతం లో తీన్ మార్ షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు జపాన్ కు చెందిన ప్రఖ్యాత దర్శకుడు అకీరా కురొసోవా అంటే పవన్ కల్యాణ్ కు చాలా ఇష్టం. అందుకే, ఆయన పేరు కలిసి వచ్చేలా 'అకీరా నందన్' అని తన తనయుడికి పేరు పెట్టుకున్న విషయం చాలా మందికి తెలిసేవుంటుంది!. | ||||
Post a Comment