NTR STYLISH MOVIE BADSHAH DETAILS



 
 
శ్రీనువైట్ల దర్శకత్వం లో స్టైలిష్ గూఢచారి ‘బాద్‌షా’
రహస్య గూఢచారి కథలతో తెలుగులో ఇప్పటి వరకు చాలా సినిమాలే తెరపైకొచ్చాయి కానీ త్వరలో ఓ స్టైలిష్ గూఢచారి మనముందు కు రానున్నాడు. అతడు మరెవరోకాదు ఎన్టీఆర్. మాస్ హీరోగా అలరిస్తున్న ఎన్టీఆర్ త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బాద్‌షా’ చిత్రంలో రహస్య గూఢచారిగా స్టైలిష్ పాత్రలో కనిపించనున్నాడని చిత్ర వర్గాల సమాచారం. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జూలై 1 నుంచి ఇటలీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అక్కడి వివిధ ప్రదేశాల్లో 25 రోజుల పాటు కథకు కీలకమైన దృశ్యాలను చిత్రీకరించనున్నారు. ఈ వారంలోనే చిత్ర యూనిట్ ఇటలీ బయలుదేర నుంది.తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం- హలీవుడ్ క్రేజీ సింగర్ అకాన్ ఓ పాట పాడనుండగా, అతనితో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గొంతు కలపబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని ఆయన గత చిత్రాలకు భిన్నంగా దర్శకుడు శ్రీనువైట్ల కొత్త లుక్‌తో చూపించనున్నాడు. ఇందుకోసం ముంబైకి చెందిన స్టైలిస్ట్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అత్యంత భారీస్థాయిలో ‘బాద్‌షా’ను తెరకెక్కిస్తున్నారు.

Post a Comment

أحدث أقدم