మెగా అభిమానులకు ప్రత్యేక రిషప్షన్ ఏర్పాటు
రాంచరణ్ తేజ్ వివాహానికి మెగా అభిమానులకు ప్రత్యేక రిషప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు తెలిపారు . ఎల్లుండి మొయినాబాద్ ఫాం హౌస్‌లో ఏర్పాటుచేస్తున్న ఈ రిసెప్షన్ వేడుకలను నాలుగువేలకు పైగా ఆహ్వానాలు పంపినట్లు ఆయన తెలిపారు . సెక్యూరిటీ రీజన్ దృష్ట్యా అభిమానులు పూల దండలు, బొకేలు తీసుకురావద్దని ఆయన కోరారు. ఆహ్వాన పత్రిక లేని వారిని ఎవరినీ అనుమతించమని... ఇన్విటేషన్ లేని వారు వచ్చి ఇబ్బందిపడవద్దని ఆయన సూచించారు. అటు.. మెగా అభిమానులు భద్రాచలం రాములవారి తలంబ్రాలు, ప్రసాదంను నాగబాబుకు అందజేశారు .
Post a Comment